WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'రెవిన్యూ'లో 'సాయి'రాం...!

సచివాలయంలోని రెవిన్యూశాఖలో క్రింది స్థాయి అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఒక అధికారి లంచాలు ఇవ్వందే కనీసం పలకరించరట. తనను కలవాలంటే ముందుగా క్రింది స్థాయి అధికారులను కలసి ఆ తరువాతే తనను కలవాలని ఆయన నిర్మోహటంగా చెబుతున్నారట.ఓం సాయిరాం..నమో సాయిరాం..అంటూ ఆ శాఖ ఉద్యోగులు వ్యగ్యంగా ఛలోక్తులు విసురుతున్నారు. ఈ అధికారి అవినీతిపై ఆరోపణలతో పాటు ఫిర్యాదులు రాగా సంబంధించిన శాఖాధిపతి అతికీలకమైన ఒక శాఖను ఆయననుండి తప్పించారు. ఈ అధికారి గతంలో ఏడేళ్లు ఒకే సెక్షన్‌లో ప్రస్తుతం బాధ్యతలు నిర్వహిస్తున్న విభాగంలోపనిచేయడం జరిగింది. అప్పట్లో రెవిన్యూ మంత్రి ఈ విషయం తెలిసి అప్పటి శాఖాధిపతి ఆయనను ఆ సెక్షన్‌ నుంచి తప్పించమని ఆదేశించడంతో దానిని ఆయన అమలు చేయడం జరిగింది. ఈ అధికారి కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో ఒక మంత్రికి కలెక్షన్లల్లో మధ్యవర్తిగా వ్యవహరించి స్వామికార్యంతో పాటు స్వకార్యం కూడా నెరవేర్చుకున్నారని పేరుంది. ఆ తరువాత రెవిన్యూశాఖలో ప్రభుత్వానికి ఆదాయం వచ్చే సెక్షన్‌లో ఏడు సంవత్సరాలు పనిచేసి దుమ్ము దులిపారు. ఆ తరువాత మళ్లీ రెవిన్యూశాఖకు వచ్చేందుకు విశ్వప్రయత్నం చేసి విఫలయ్యారు. ఈ మధ్యలో ఎవరిని ఎలా పట్టుకున్నారో బయటకు పొక్కకపోయినా మళ్లీ రెవిన్యూశాఖలో క్రింది స్థాయి అధికారిగా బదిలీ చేయించుకున్నారు. ఎవరినీ లెక్కచేయరు..లాభం లేంది..ఎవరితో మాట్లాడరు. ఈ అధికారి అహంకారంతో మాట్లాడతారు..అదేమిటని అడిగితే మీకు దిక్కు ఉన్నచోట చెప్పుకోమని కసరుకుంటారు. పరిస్థితి ఎలా ఉందంటే ఈ శాఖాధిపతి కూడా అంత అంహకారంగా ఉండరని, ఈ క్రింది స్థాయి అధికారి ఏమి చూసుకుని అమిడిసిపడుతున్నారో అర్థం కావడం లేదని ఉద్యోగులు చెబుతున్నారు. ఇన్నేళ్ల సర్వీసులో ఈ అధికారి కోట్లు సంపాదించారని విచారణ జరిపిస్తే వాస్తవాలు బయటకు వస్తాయని సహచర ఉద్యోగులు చెబుతూ...విచారణ జరిపించే అధికారులు..మంత్రులు..తమ పని చేసుకుంటున్నారే తప్ప ఈ అధికారిపై దృష్టిసారించడం లేదు.

(338)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ