WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'నయీం' ఎన్‌కౌంటర్‌తో ఉలిక్కిపడుతున్న ఆంధ్రా పోలీసులు...!

గ్యాంగ్‌స్టర్‌ 'నయీం'ను ఎన్‌కౌంటర్‌ చేయడంతో గతంలో ఆయనకు సహకరించి, లక్షలు,కోట్లు వెనకేసుకుని రిటైర్‌ అయిన పోలీసు అధికారులు ఇప్పుడు ఉలిక్కిపడుతున్నారు. 'నయీం' ఎన్‌కౌంటర్‌ తరువాత అతనికి ఏయే ఏయే అధికారితో సంబంధాలు ఉన్నదీ పూసగుచ్చినట్లు డైరీలో రాయడంతో వీరు తమ పేర్లు ఎక్కడ బయటకు వస్తాయోనని ఆందోళన చెందుతున్నారట. క్రింది స్థాయి పోలీసు అధికారులతోపాటు, కొంత మంది ఐపిఎస్‌ అధికారులు కూడా హైదరాబాద్‌లో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వహించిన వారు అప్పట్లో 'నయీం'తో అనేక పనులు చక్కపెట్టి ఆర్థిక లబ్ది పొందారు. తెలంగాణ సిఎం కెసిఆర్‌ దీనిపై పూర్తి విచారణ జరిపితే ఇప్పుడు ఆంధ్రాలో పనిచేస్తున్న కొంత మంది పోలీసు అధికారులతో పాటు రిటైర్‌ అయిన మరి కొంత మంది అధికారుల జాతకాలు బయటపడతాయి. తెలంగాణ అధికారులే ఎక్కువ మంది 'నయీం'కు సహకరించారని, వారిలో ఒకరు ప్రస్తుతం ముఖ్యమైన హోదాలో ఉన్నారని ఆంధ్రా ప్రాంతానికి చెందిన అధికారులు చెబుతున్నారు. తెలంగాణలో ఎవరెవరు ఉన్నారో మనకు అనవసరమని, ఆంధ్రాలో 'నయీం'కు సహకరించిన వారు ఉంటే వారిపై ఎటువంటి చర్యలు తీసుకోవాలనే దానిపై ఆంధ్రా పోలీసు ఉన్నతాధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. దీనిపై ముఖ్యమంత్రి,హోం మంత్రి, డిజిపి ఇంకా స్పందించలేదు. కారణం ఏమిటంటే ఇంత వరకూ తెలంగాణ ప్రభుత్వం ఎవరి పేర్లను బయటపెట్టలేదు. ఒక వేళ వారు కనుక ఆంధ్రా పోలీసుల పేర్లు బయటపెడితే అప్పుడు స్పందించాలని వీరు భావిస్తున్నారు.

(1087)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ