రన్‌వేపై పరుగెత్తి విమానం ఎక్కేశాడు...!(వీడియో)

మనం ఎక్కడకో ప్రయాణం చేద్దామని బస్స్టాండ్కో, రైల్వేస్టేషన్‌కో వెళతాం..అంతలో ఆ బస్సు, రైలు వెళుతూ ఉంటాయి...మనం వెంటనే పరుగెత్తికి వెళ్లి వాటిలో ఎక్కేసి అమ్మయ్య అని ఊపిరిపీల్చుకుంటాం...అచ్చం అవిమానంలో ఎక్కాడో వ్యక్తి. విమానంలో పరుగెత్తికి వెళ్లి ఎక్కడం ఏమిటనుకుంటున్నారా? అవునండి...విమానం బయలుదేరి రన్‌వేపైకి వెళుతోంది...మనోడు దానికి అడ్డంగా పరుగెత్తికి వెళ్లి దానిలోకి ఎక్కాడు..ఇంతకీ ఎక్కడ జరిగిందీ సంఘటన అనుకుంటున్నారా? లండన్‌లో ఆగస్టు5వ తేదీన ఈ సంఘటన జరిగింది. ఈ తంగానంతా వీడియో తీసిన వ్యక్తి దాన్ని ఇప్పుడు నెట్లో పెట్టారు. ఇప్పుడా వీడియో వైరల్‌గా మారింది. మాడ్రిడ్ నుంచి గ్రాన్ కెనారియా వెళ్లాల్సిన వ్యక్తి ఆలస్యంగా విమానాశ్రయానికి వచ్చాడు. కానీ అప్పటికే బోర్డింగ్ సమయం దాటిపోయింది. ఎలాగైనా ప్రయాణం చేయాలని భావించిన ఆ వ్యక్తి ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుంచి దూకి రన్‌వే వైపు పరుగెత్తికెళ్లాడు. ఛేజ్ చేసి విమానం ఎక్కాడు. విమానం కెనారియా చేరుకోగానే సదరు వ్యక్తిని అరెస్టు చేశారు పోలీసులు. ఈ వ్యక్తి ఉగ్రదాడికి ఏమైనా పాల్పడడానికి ఇలా చేశాడా? అని పోలీసులు విచారించి అటువంటిదేమీ లేదని తేలడంతో అతన్ని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. విమానయాన నియాలను ఉల్లంఘించినందుకు అతనిపై విచారణ జరుగుతోంది.