WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

అశ్విన్‌,సాహా సెంచరీలు...!

వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడవ టెస్టు మ్యాచ్‌లో రెండవ రోజు అశ్విన్‌, సాహాలు సెంచరీలు సాధించి భారత్‌ను పటిష్టస్థితిలో నిలిపారు. నిన్న 75పరుగులతో నాటౌట్‌గా ఉన్న అశ్విన్‌ నేడు లంచ్‌ విరామం తరువాత సెంచరీ సాధించాడు. 99 పరుగులతో లంచ్‌కు వెళ్లి వచ్చిన అశ్విన్‌ తరువాత ఓవర్‌లో పరుగులేమీ చేయలేదు.అయితే తరువాత ఓవర్‌లో సిక్స్‌బాది సెంచరీ పూర్తి చేశాడు. ఈ సిరీస్‌లో అశ్విన్‌ది ఇది రెండో సెంచరీ మొత్తం 265 బంతులు ఎదుర్కొన్న 'అశ్విన్‌' ఐదు ఫోర్లు ఒక సిక్స్‌తో సెంచరీ సాధించాడు. కెరీర్‌లో నాల్గవ సెంచరీ చేసిన అశ్విన్‌ అసలు సిసలైన ఆల్‌రౌండర్‌ను తలింపించాడు. కాగా మరో వైపు కీపర్‌ 'సాహా' కూడా సెంచరీ సాధించాడు. 224 బంతుల్లో 12ఫోర్లతో 'సాహా' సెంచరీ సాధించాడు. 'సాహా'కు ఇదే మొదటి టెస్ట్‌ సెంచరీ. కాగా వికెట్‌ కీపర్‌ల్లో విదేశాల్లో సెంచరీ సాధించిన నాల్గవ వ్యక్తి 'సాహా' గతంలో 'విజయమంజ్రేకర్‌, ఎం.ఎస్‌.ధోనీ, అజయ్‌రాత్రాలు మాత్రమే విదేశాల్లో సెంచరీలు సాధించారు. సెంచరీ సాధించిన వెంటనే దూకుడుగా ఆడబోయిన 'సాహా' జోసెఫ్‌ బౌలింగ్‌లో వికెట్‌ కీపర్‌ క్యాచ్‌తో అవుట్‌ అయ్యాడు.

(261)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ