WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'రోజా' చేరికకు 'బాబు' నో...!

నిన్నటి వరకు 'చంద్రబాబు'ను అవినీతి పరుడంటూ విమర్శలు చేసిన నగరి ఎమ్మెల్యే 'రోజా' మధ్యవర్తుల ద్వారా 'చంద్రబాబు'ను సంప్రదించగా ఆమెను చేర్చుకునే సమస్యేలేదని చెప్పారట. కొద్ది రోజులుగా తన ప్రయత్నాలు చేస్తున్న 'రోజా'కు 'చంద్రబాబు' వైఖరి తెలియడంతో ప్లేట్‌ మార్చారు. తనకు పార్టీ మారే ఉద్దేశ్యం లేదని, 'జగన్‌' పార్టీని వీడనని, తనపై కావాలని కొందరు ప్రచారం చేస్తున్నారని 'రోజా' చెప్పుకుంటున్నారు. 'రోజా' ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని, ఆ ఇబ్బందులను అధిగమించేందుకే పార్టీ మారాలని భావిస్తున్నట్లు 'జగన్‌' పార్టీ నేతలు ఆఫ్‌ ది రికార్డుగా చెబుతున్నారు. 'రోజా'ను టిడిపిలో చేర్చుకునేందుకు మీరు అంగీకరిస్తారా? అని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ ముద్దుకృష్ణమనాయుడును 'జనం ప్రత్యేక ప్రతినిధి' స్వయంగా అడిగినప్పుడు ఆయన స్పందిస్తూ 'మా నేత 'చంద్రబాబు' ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని అన్నారు. కానీ 'నగరి' నియోజకవర్గ టిడిపి నేతలు, కార్యకర్తలు, జిల్లా టిడిపి నాయకులు 'రోజా' చేరికను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వై.ఎస్‌.జగన్‌ కూడా చంద్రబాబుపై చేయని విమర్శలను, ఆరోపణలను 'రోజా' చేశారని, ఆమెది అసలే ఐరన్‌లెగ్‌ అని ఎట్టి పరిస్థితుల్లో 'రోజా'ను పార్టీలో చేర్చుకోవద్దని 'చినబాబు'ను కలసి చెప్పేందుకు కొందరు హైదరాబాద్‌ వచ్చారు. కానీ 'రోజా'ను వైకాపా నుంచి పంపేందుకు 'జగనే' ప్రయత్నిస్తున్నారని వ్యగ్యంగా 'దేశం' నేతలు అంటున్నారు. ఎందుకలా అంటే ఆమెది ఐరన్‌లెగ్‌ అని ఆ లెగ్‌ ప్రభావంతో 2004,2009లో 'చంద్రబాబు' అధికారం కోల్పోయారని, 2014 ఎన్నికల్లో ఆమె 'జగన్‌' పార్టీలో విజయం సాధించినా, ఆమె లెగ్‌ ప్రభావంతో అధికారంలోకి రాలేకపోయారని, ఏదో విధంగా ఆమెను పార్టీ నుంచి బయటకు పంపిస్తే తమ నేత అధికారంలోకి వస్తారని వారు వ్యాఖ్యానిస్తున్నారట. ఏది ఏమైనప్పటికీ 'రోజా' టిడిపిలోకి చేరడానికి ప్రయత్నించిన మాట యధార్థమేనని, ఆమెను చేర్చుకునేందుకు 'బాబు' నిరాకరించిన మాట కూడా నిజమేనని సిఎంఒ వర్గాలు తమ సన్నిహితులతో తెలిపాయి. తనను చేర్చుకునేందుకు 'బాబు' ఆసక్తి చూపని సంగతి తెలుసుకున్న 'రోజా' తాను పార్టీ మారడం లేదని మీడియాకు తెలిపారు.

(117)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ