WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

క్వార్టర్స్‌లో 'శ్రీకాంత్‌'...!

రియో ఒలింపిక్స్‌ 10వ రోజు ఆటల్లో భారత్‌కు విజయం దక్కింది. షట్లర్‌ కాదంబి శ్రీకాంత్‌ ఘన విజయం సాధించాడు. పతక వేటలో బరిలో కొనసాగుతున్నాడు. రౌండ్‌ 16లో డెన్మార్క్‌ ఆటగాడు జార్గెన్సన్‌పై 2-0 తేడాతో గెలుపొంది క్వార్టర్స్‌ ఫైనల్స్‌కు చేరుకున్నాడు. రెండు వరుస సెట్లలో 21-19, 21-19 తేడాతో ప్రత్యర్ధిని చిత్తు చేశాడు. దీంతో క్వార్టర్‌ ఫనల్స్‌లో చైనా క్రీడాకారుడు లిన్‌ డాన్‌తో 17వ తేదీన సాయింత్రం 6 గంటలకు తలపడనున్నాడు. మరో పక్క మలేషియా ఆటగాడు లి చాంగ్‌ వి క్వార్టర్‌ ఫైనల్స్‌కు చేరుకున్నాడు. భారత్‌ తరుపున క్వార్టర్‌ ఫైనల్స్‌కు చేరుకున్న రెండో ఆటగాడు కాదంబి శ్రీకాంత్‌. అంతకుముందు కశ్యప్‌ మాత్రమే ఒలింపిక్స్‌లో క్వార్టర్స్‌కు చేరుకున్నాడు.


(242)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ