WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ఆర్టీసీలో కండక్టర్ల వ్యవస్థకు పుల్‌స్టాప్‌...!

ఆంధ్రాప్రాంత ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో కండక్టర్లతో ప్రమేయం లేకుండా ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బంది ద్వారా ప్రయాణీకులకు టిక్కెట్లను అమ్మిస్తున్నారు. దీంతో భవిష్యత్‌లో కండక్టర్ల నియామకాలు ఎక్కువగా ఉండవని ఆర్టీసీ యాజమాన్యం సంకేతం ఇచ్చినట్లు కనిపిస్తోంది. ఉదాహరణకు ఒక పట్నంనుండి ఎక్స్‌ప్రెస్‌ బస్సు బయలు దేరే ముందు అక్కడే ఉండే ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగి టిక్కెట్లను ప్రయాణీకులకు ఇచ్చి వెంటనే దిగిపోతున్నారు. ఆ తరువాత బస్‌స్టాప్‌లో మరో అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగి ప్రత్యక్షం అవుతారు. అక్కడ ఎవరన్న ప్రయాణీకులు బస్సులో ప్రయాణించేందుకు వస్తే అక్కడ టిక్కెట్‌ ఇచ్చి వెంటనే దిగిపోతారు. ఇప్పటి వరకు ఈ విధానాన్ని ఎక్స్‌ప్రెస్‌ బస్సులకు మాత్రమే పరిమితం చేసినప్పటికి భవిష్యత్‌లో ఆర్డినరీ బస్సులకు కూడా ఔట్‌సోర్సింగ్‌ ద్వారా టిక్కెట్లను ఇచ్చే విధంగా వ్యవహరిస్తారా? ఇప్పటికే దూర ప్రాంతాలకు బస్సు డిపోల్లో ఉన్న బుకింగ్‌ల ద్వారా, ఆర్టీసీ డ్రైవర్ల ద్వారా,ఇంటర్‌నెట్‌ ద్వారా, ప్రైవేట్‌ ఏజెన్సీల ద్వారా టిక్కెట్లను మంజూరు చేస్తున్నారు. దీంతో బస్సుల్లో కండక్టర్ల అవసరం లేదని స్పష్టం అవుతోంది. ముందు ముందు ఆన్‌లైన్‌ ద్వారా బస్సు డిపోల్లో ఉన్న బుకింగ్‌ కేంద్రాల ద్వారా ఎక్కువగా లావాదేవీలు జరిగే నేపథ్యంలో ఆర్టీసీలో అనేక పోస్టులు రద్దు అయ్యే అవకాశాలు ఉన్నాయి. నిన్నటి వరకు కండక్టర్‌గా నియమితులయిన వారు ఎడిసిగా, డిసిగా రిటైర్‌ అయ్యేవారు. కండక్టర్ల నియామకాలే ఉండవు. అఆయా పోస్టులను ప్రమోషన్‌ ద్వారా భర్తీ చేసే అవకాశం ఉండదు. దీంతో అనేక బస్సు డిపోల్లో ఈ పోస్టులను రద్దు చేసే అవకాశం ఉంది. ఈ విధానాన్ని ఆర్టీసీ యాజమాన్యం ప్రవేశపెట్డడంతో ప్రస్తుత సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు లేకపోయినా భవిష్యత్‌లో సిబ్బంది నియామకాలు లేకపోవడంతో నిరుద్యోగులకు ఆశాంభగం ఎదురయ్యే పరిస్థితి ఉంది. కానీ ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో ఈ విధమైన విధానాన్ని ప్రవేశపెట్టినప్పుడు యూనియన్‌ సంఘాలు మొదటల్లో కొంత అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ ప్రస్తుతం పనిచేస్తున్నావారికి ఇబ్బందులు లేకపోవడంతో వారు మౌనం వహించారు.దీంతో ఆర్టీసీలో క్రమం క్రమంగా కండక్టర్ల వ్యవస్థ అంతరించపోనుంది.

(334)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ