WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'ఎం.ఎస్‌.ధోనీ' తెలుగు ట్రైలర్‌...!

భారత్‌కు క్రికెట్‌లో రెండు ప్రపంచ కప్‌లు అందించి, భారత్‌ క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా పేరుగాంచిన మహేంద్రసింగ్‌ ధోనీ నిజ జీవిత కథతో వస్తోన్న చిత్రం 'ఎంఎస్‌ ధోనీ', సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ ధోనీ పాత్రలో నటించిన ఈ చిత్రానికి నీరజ్‌పాండే దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే హిందీలో ఈ చిత్రం ట్రైలర్‌ అత్యధికక వ్యూస్‌ సాధించి రికార్డు సృష్టించగా దాన్ని తెలుగులోకి అనువాదం చేసి ఈ రోజున విడుదల చేస్తున్నారు. సెప్టెంబర్‌30న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. ధోనీ టిక్కెట్‌ కలెక్టర్‌ దగ్గర నుంచి భారత్‌కు టీ20, వరల్డ్‌కప్‌ అందించే వరకు ధోనీ సాగించిన ప్రస్తానాన్ని ఈ చిత్రంలో చూపించబోతున్నారు.



(115)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ