WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'ఆంధ్రా'పై ఎందుకీ ఈ చిన్నచూపు...!

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఏర్పడి ఇప్పటికి రెండేళ్లకు పైగా అయింది. ప్రత్యేక హోదా ఇస్తామన్నారు..దాని ఊసెత్తడంలేదు..రాష్ట్ర రెవిన్యూలోటు తీర్చే బాధ్యత తమదే అన్నారు..అదీ మర్చిపోయారు..ఆంధ్రరాష్ట్రంపై కేంద్రపాలకులు ఎందుకు ఇంత చిన్నచూపు చూస్తున్నారో అర్థం కావడం లేదు..కేంద్ర ప్రభుత్వం తీరు కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు ఉందని ఆయన వ్యంగ్యంగా విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌ లక్షకోట్లు ఇచ్చామని చెప్పిన పెద్దలు తాజాగా విడుదల చేసిన నిధులు కేవలం ముష్టి వేశారని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు దుయ్యబట్టారు. అమరావతి నిర్మాణం రూ.47,500కోట్లతో డిపిఐఆర్‌ ఇచ్చామని కానీ కేంద్రం ఇచ్చిన రూ.400కోట్లు డ్రైనేజ్‌లైన్లు తవ్వడానికే సరిపోవని ఆయన అన్నారు. రూ.30వేల కోట్లు అయ్యే పోలవరం ప్రాజెక్టుకు తాజాగా రూ.700కోట్లు మాత్రమే ఇచ్చారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో ఓపికగా,కలసికట్టుగా వెళుతున్నప్పటికీ కేంద్ర పాలకుల తీరు పలు అనుమానాలకు తావిస్తోందని ఆయన విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాత్రిబంవళ్లు కష్టపడుతున్నప్పటికీ నిధులు కేటాయింపు విషయంలో కేంద్రం ఇప్పటికీ చెప్పేదొకటి చేసేదొకటిగా వ్యవహరిస్తుందని ఆయన విమర్శించారు. రెవిన్యూలోటును మొత్తాన్ని తామే భర్తీ చేస్తామని చెప్పిన ఆర్థికమంత్రి ఈ రెండేళ్లలో ఆ లోటును భర్తీ చేశారా? అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజల సహనాన్ని పరీక్షించవద్దని, కేంద్రం ఇచ్చిన హామీలను కార్యరూపంలోకి తీసుకురావాలని ఆయన కోరారు.

(158)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ