WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

మొదటి సెట్‌ గెల్చిన 'సింధు'...!

రియో ఒలింపిక్స్‌లో బ్యాట్మింటన్‌ మహిళల సెమీ ఫైనల్‌లో తెలుగమ్మాయి పివి సింధు దూసుకుపోతోంది. సెమీఫైనల్‌లో భాగంగా జపాన్‌ క్రీడాకారిణి నోజోమీ ఒకుహరాతో జరుగుతున్న మ్యాచ్‌లో మొదటి సెట్‌ను సింధు 21-19తో గెల్చుకుంది. ఇరువురు క్రీడాకారులు హోరా హోరిగా తలపడడంతో మ్యాచ్‌ ఉత్కంఠభరితంగా సాగుతోంది. ఒకరిపై ఒకరు పైచేయి సాధించడానికి ప్రయత్నాలు చేసినా 'సింధు' అద్భుతమైన ఆటతో మొదటి సెట్‌ను గెల్చుకుంది. రెండో సెట్‌లో 3-2తో ముందుకు దూసుకుపోతోంది సింధు. ఆట ప్రస్తుతం జరుగుతోంది.

(175)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ