లేటెస్ట్

ముగ్గురు నేత‌లు...మూడు దారులు..!

(అబ్దుల్ స‌లాం, వినుకొండ‌)

గుంటూరు జిల్లా ‘వినుకొండ’ నియోజ‌క‌వ‌ర్గం అనాదిగా వెనుక‌బాటుకు గురౌతూనే ఉంది. ప్ర‌జాప్ర‌తినిధులు ఎంద‌రు మారినా..ఇక్క‌డ మాత్రం ప్ర‌జ‌ల ఇక్క‌ట్లు మాత్రం తీర‌డం లేదు. ప‌ల్నాడు ప్రాంతంలో ఉన్న వెనుక‌బాటు త‌నం అంతా ఇక్క‌డే ఉంది. వ్య‌వ‌సాయం ప్ర‌ధాన వృత్తిగా జీవించే ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌స్తుతం వ్య‌వ‌సాయం గిట్టుబాటుకాక రైతులు, రైతుకూలీలు వ‌ల‌స‌బాట‌ప‌డుతున్నారు. అనాదిగా వ్య‌వ‌సాయాన్ని న‌మ్ముకున్న కుటుంబాలు ఇప్పుడు వ్య‌వ‌సాయాన్ని వ‌దిలేసి ఇత‌ర రంగాల‌కు త‌ర‌లిపోతున్నారు. వెనుక‌బాటుత‌నం, నిర‌క్ష‌రాస్య‌త, అభివృద్ధిలేమితో ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డుతున్నా ఇక్క‌డ ఎన్నికైన నేత‌లు స్వంత అభివృద్ధినే ధ్యేయం పెట్టుకుని ప్ర‌జ‌ల‌ను విస్మ‌రిస్తున్నారు. గ‌తంలో ఇక్క‌డ క‌మ్యూనిస్టుల ప్రాబ‌ల్యం అధికంగా ఉండేది. అయితే ‘ఎన్టీఆర్’ టిడిపి పార్టీ స్ధాపించిన ద‌గ్గ‌ర నుంచి క‌మ్యూనిస్టుల ప్ర‌భ మ‌స‌గ‌బారుతూ వ‌చ్చింది. అయితే త‌రువాత కాలంలో టిడిపికి, కాంగ్రెస్ కు చెందిన వారు ఎమ్మెల్యేలుగా ఎన్నికైనా ఇక్క‌డ మాత్రం అభివృద్ధి జ‌ర‌గ‌లేద‌న్న‌ది ప‌చ్చి నిజం. గ‌తాన్ని వ‌దిలేస్తే ఇటీవ‌ల కాలంలో ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ముగ్గురు నేత‌లు స్ధానికంగా చ‌క్రం తిప్పుతున్నారు. 2004లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ‘మ‌క్కెన మ‌ల్లిఖార్జున‌రావు’, 2009,2014లో గెలిచిన ‘జి.వి.ఆంజ‌నేయులు’, 2019 ఎన్నిక‌ల్లో గెలిచిన ‘బొల్లా బ్ర‌హ్మ‌నాయుడు’లు ఇక్క‌డి రాజ‌కీయాల‌ను శాసిస్తున్నారు.


2004లో ఎమ్మెల్యేగా ప‌నిచేసిన ‘మ‌క్కెన’కు నియోజ‌క‌వ‌ర్గంలో ఘ‌న‌నీయ‌మైన ప్ర‌జ‌ల మ‌ద్దుతు ఉంది. బంధురికం అధికంగా ఉన్న ఆయ‌న‌కు కాలం క‌ల‌సిరావ‌డం లేదు. 2004లో ఎమ్మెల్యేగా గెలిచిన ఆయ‌న‌కు 2009లో కాంగ్రెస్ అధిష్టానం టిక్కెట్ నిరాక‌రించింది. అప్ప‌టి నుంచి ఆయ‌న రాజ‌కీయంగా ప‌త‌నావ‌స్థ‌ను ఎదుర్కొంటున్నారు. రాష్ట్ర విభ‌జ‌న త‌రువాత జిల్లా అధ్య‌క్షుడిగా ప‌నిచేసినా, కాంగ్రెస్ ను ప్ర‌జ‌లు న‌మ్మ‌క‌పోవ‌డంతో చివ‌రికి వైకాపాలో చేరాల్సి వ‌చ్చింది. వైకాపాలో చేరితే మంచి భ‌విష్య‌త్తు ఉంటుంద‌ని తీసుకువ‌చ్చిన పెద్ద‌లు ఆయ‌న‌ను గాలికి వ‌దిలేశారు. ప్ర‌స్తుత ఎమ్మెల్యే ‘బొల్లా’ను గెలిపించ‌డానికి ఎంతో కృషి చేసిన ‘మ‌క్కెన‌’ను ‘బొల్లా’ అసలు ప‌ట్టించుకోకుండా అవ‌మానిస్తున్నారు. ఆయ‌న వ‌ర్గానికి ఎటువంటి ప్రాధాన్య‌తను ఇవ్వ‌డం లేదు. పైగా ఆయ‌న వ‌ద్ద‌కు ఎవ‌రైనా కార్య‌క‌ర్త‌లు వెళితే వారిని హెచ్చ‌రిస్తున్నారు. త‌న‌ను పార్టీలోకి తీసుకువ‌చ్చి ఇంత అవ‌మానిస్తున్నా ‘మ‌క్కెన’ మాత్రం ఎప్పుడూ బ‌య‌ట‌ప‌డ‌కుండా మంచిరోజుల కోసం ఎదురుచూస్తున్నారు. అయితే త‌న‌ను అభిమానించే వ‌ర్గాల‌ను ఆయ‌న నిత్యం క‌లుస్తూ వారితో మ‌మేక‌మ‌వుతున్నారు. అధికారం లేక‌పోయినా, ఎటువంటి ప‌ద‌వి లేక‌పోయినా ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గంలోని ప్ర‌తి గ్రామాన్ని సంద‌ర్శిస్తూ ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను తెలుసుకుని త‌న‌కు చేత‌నైన స‌హాయం చేస్తున్నారు. 


కాగా గ‌త ఎన్నిక‌ల్లో బ్ర‌హ్మాండ‌మైన మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిచిన ‘బ్ర‌హ్మ‌నాయుడు’ ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉండ‌డంలేద‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.త‌న‌ను క‌లిసేందుకు వ‌చ్చేవారిని ‘న‌ర్స‌రావుపేట’ ర‌మ్మ‌ని చెబుతున్నార‌ట‌. మారుమూల ప్రాంతాల నుంచి ‘న‌ర్స‌రావుపేట‌’కు వెళ్ల‌డం ప్ర‌జ‌ల‌కు ఇబ్బంది అవుతోంది. ఎమ్మెల్యేగారు ‘న‌ర్స‌రావుపేట’ ర‌మ్మ‌న్నార‌ని వారు బస్సుల‌కు సొమ్ములు ఖ‌ర్చుచేసుకుని వ‌స్తే ఇక్క‌డ క‌ల‌వ‌కుండా వారి స‌మ‌స్య‌ల‌ను విన‌కుండా, ‘వినుకొండ’ రండి, అక్క‌డ మాట్లాడుకుందాం అని కారు ఎక్కి వెళ్లిపోతున్నార‌ట‌. ఇదెక్క‌డి గోల‌రాబాబూ...? మ‌ళ్లీ ‘వినుకొండ‌’కా..? అంటూ వారు తీవ్ర నిరాశ‌కు గురై తిరుగుప్ర‌యాణం చేస్తున్నార‌ట‌. ఇది ఇలా ఉంటే త‌మ‌కేదైనా ప్ర‌భుత్వ ప‌థ‌కాలు రాక‌పోతే ఎమ్మెల్యే వ‌ద్ద‌కు వెళ్లి మొర‌పెట్టుకుంటే నేనేమి చేస్తాను...అంతా వాలంటీర్లు, గ్రామ స‌చివాల‌య సిబ్బంది చూస్తారు..వారి వ‌ద్ద‌కు వెళ్లండి..అంటూ ఆయ‌న స‌ల‌హా ఇచ్చి ఊరుకుంటున్నార‌ట‌. దీంతో..వ‌చ్చిన వారు..ఎమ్మెల్యే ఏదో చేస్తార‌ని వ‌స్తే ఆయ‌నే చేతులు ఎత్తేస్తున్నారు..అనుకుంటూ వెళ్లిపోతున్నార‌ట‌. ఎమ్మెల్యే వ్య‌క్తిగ‌త సిబ్బంది ఆయ‌న‌కు తెలియ‌కుండానే ప‌లు విష‌యాల్లో చేతులు దూర్చి అక్ర‌మంగా సంపాదించుకుంటున్నార‌నే మాట కూడా స‌ర్వ‌త్రా వినిపిస్తోంది. ఇటీవ‌ల వ‌ర‌కు ఎమ్మెల్యేకు వ్య‌క్తిగ‌త స‌హాయ‌కుడిగా ఉన్న‌వ్య‌క్తి భారీగా సంపాదించుకున్నార‌ని, ఎమ్మెల్యేకు ప్ర‌భుత్వ వ్య‌వ‌హారాల్లో విష‌య‌ప‌రిజ్ఞానం లేక‌పోవడంతో అతడు ఆడింది ఆట‌గా మారిపోయింద‌నే ప‌లువురు వైకాపా నేత‌లే అంటున్నారు. కాగా పేద‌ల‌కు ఇచ్చే ప‌ట్టాల విష‌యంలో త‌న స్వంత భూముల‌ను ఎమ్మెల్యే అధిక ధ‌ర‌ల‌కు ప్ర‌భుత్వానికి అమ్ముకుని లాభ‌ప‌డ్డార‌ని, ఆయ‌న తన స్వంత సంస్థ‌కు మేలు చేసేందుకే ప‌నిచేస్తున్నార‌నే విమ‌ర్శ‌లు స‌ర్వ‌త్రా వినిపిస్తున్నాయి. తాను ఆర్ధికంగా ఎంతో బ‌లవంతుడ‌న‌ని, త‌న‌కు సొమ్ముల‌తో ప‌నిలేద‌ని, ఈ ప్రాంత‌వాసిగా, ఈ ప్రాంత ప్ర‌జ‌ల‌కు మేలు చేయాల‌నే ఉద్దేశంతో ఉన్నాన‌ని ఎన్నిక‌లకు ముందు ప్ర‌జ‌ల‌కు న‌చ్చ‌చెప్పి ఓట్లు వేయించుకున్న ‘బొల్లా’ ఈ రెండేళ్ల‌లో ఆయ‌న ప్ర‌జ‌ల‌కు మేలు చేశారా..?  లేక స్వంత ఆస్తులు పెంచుకుంటున్నారా..అన్న ప్ర‌శ్న ప‌లువ‌రు నుంచి వ‌స్తోంది. 


ఇక మాజీ ఎమ్మెల్యే ‘జి.వి.ఆంజ‌నేయులు’ గ‌త ఎన్నిక‌ల్లో స్వ‌యం త‌ప్పిదాల‌తో ఓట‌మి చెందారు. ఆప‌ద‌లో ఉన్న ప్ర‌తివారిని ఆదుకునేందుకు ముందుకు వ‌చ్చే మ‌నిషిగా ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గంలో పేరు తెచ్చుకున్నారు. 24 సంవ‌త్స‌రాలుగా స్వ‌చ్చంధ సంస్ధ‌తో నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు సేవ చేస్తూన్న ఆయ‌న‌ను ఇక్క‌డి ప్ర‌జ‌లు రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించి రుణం తీర్చుకున్నారు. అయితే ఆయ‌న హ‌యాంలో చెప్పుకోద‌గిని ఒక్క‌ప‌నినీ పూర్తిచేయ‌లేక‌పోయారు. అంతే కాకుండా త‌న అనుచ‌రుల‌ను ఇష్టారాజ్యంగా వ‌దిలేశారు. వారు చేసిన అక్ర‌మాల‌న్నీ ‘జీవీ’ ఖాతాల‌ప‌డిపోయి..ఆయ‌న ఓట‌మికి కార‌ణం అయ్యాయి. అయితే ప్ర‌స్తుత ఎమ్మెల్యే పాల‌న‌ను చూస్తున్న‌వారు..అన‌వ‌స‌రంగా ‘జీవీ’ని ఓడించామ‌నే భావ‌న‌తో ఉన్నారు. ఆయ‌న ద‌గ్గ‌రకు ఎప్పుడైనా వెళ్ల‌వ‌చ్చు..ఎప్పుడైనా క‌ల‌వ‌వ‌చ్చు..ఆప‌ద వ‌స్తే ఎప్పుడైనా ఆదుకుంటారు..అటువంటివాడిని చిన్న‌చిన్న త‌ప్పుల‌కు ఓడించామ‌నే బాధ కొంద‌రిలో క‌నిపిస్తోంది. అయితే..ప్ర‌తిప‌క్షంలోకి వ‌చ్చిన త‌రువాత ‘జీవీ’ దూకుడుగా వెళ్ల‌లేక‌పోతున్నార‌ని, ప్రజ‌ల‌ను కూడ‌గ‌ట్ట‌లేక‌పోతున్నార‌నే మాట వినిపిస్తోంది. పోలీసులు కేసులు పెడ‌తారేమో..జైలుకు పంపుతార‌మో..క‌క్ష‌సాధింపు చ‌ర్య‌ల‌కు దిగుతార‌మోన‌న్న భావ‌న‌తో ఆయ‌న నెమ్మ‌దిగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని, అపార‌మైన టిడిపి కార్య‌క‌ర్త‌ల బ‌లం, బంధుబ‌లం క‌లిగిన ‘జీవీ’ మ‌రింత దూకుడుగా ఉండాల‌ని పార్టీ అభిమానులు,కార్య‌క‌ర్త‌లు కోరుకుంటున్నారు. నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌స్తుతం క్రియాశీల‌కంగా ఉన్న ఈ ముగ్గురు నేతలు..మూడు విధాలుగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ప్ర‌జ‌లు భావిస్తున్నారు. మొత్తం మీద‌..వెనుక‌బ‌డిన ‘వినుకొండ’ నియోజ‌క‌వ‌ర్గంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా..మ‌రింత వెనుక‌బాటుకు గురౌతుందే కానీ..అభివృద్ధి చెంద‌డం లేద‌నే మాట ప్ర‌జ‌ల నుంచి వినిపిస్తోంది. 

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ