WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'సోమిరెడ్డి' ఎక్కడ...?

నిన్నటి వరకూ 'జగన్‌'పై అవినీతి ఆరోపణలు, విమర్శలతో దాడి చేసిన తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ మంత్రి, ఎమ్మెల్సీ ఇటీవల కాలంలో పూర్తిగా మౌనం వహిస్తున్నారు. ఎందుకు ఆయన మౌనంగా ఉంటున్నారో అని ఆరా తీయగా...ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఇప్పట్లో మంత్రివర్గ విస్తరణ జరగదని తెలియడమే ఆయన మౌనానికి కారణమట. మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో ఉండదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా వెల్లడించడంతో ఎందుకు వచ్చిన కంఠశోష అని ఆయన జిల్లాకే పరిమితమవుతున్నారట. ఇంతకీ ఆయన ఎవరనుకుంటున్నారా? ఆయన నెల్లూరుకు చెందిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి. వరసగా అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయాలు పాలవుతున్న ఈయనకు జిల్లా ప్రజానీకంలో పలుకుడి తగ్గిపోయింది. మూడుసార్లు ప్రజాతిరస్కరానికి గురై ఓటమి హ్యాట్రిక్‌ కొట్టారు. ఓడిన అనంతరం కొద్ది రోజులు 'జగన్‌'పై వాడి వేడి విమర్శలు, ఆరోపణలు చేశారు..ఇంతలో రాజ్యసభ ఎన్నికలు వచ్చాయి..సామాజికవర్గ కోటాలో సీటు ఆశించి భంగపడ్డారు. చివరకు 'బాబు'దయతో ఎమ్మెల్సీపోస్టుతో సర్దుకుపోయారు. ఆ తరువాత ఏమనుకున్నారో ఏమో కానీ...మళ్లీ 'జగన్‌'పై విమర్శలు చేయడం ప్రారంభించారు. ఇంతలో అసలు విషయం తెట తెల్లం కావడంతో సొంత జిల్లా నెల్లూరుకే పరిమితం అవుతున్నారు. ఈ జిల్లాకు చెందిన 'నారాయణ' చంద్రబాబుకు ఆప్తుడు కదా...'మీకు మంత్రి పదవి ఎలా వస్తుందని ప్రశ్నించిన నాయకులు నిలదీసినట్లుగా అడగడంతో అప్పటి వరకు 'నారాయణ'కు దూరంగా మెలిగిన 'సోమిరెడ్డి' మెల్లగా ఆయన పంచన చేరారు. ఎందుకు 'సోమిరెడ్డి' ఎలా 'నారాయణ' గూటికి వెళ్లారు అని జిల్లా నాయకులను అడిగితే 'రెడ్డి' సామాజికవర్గానికి చెందిన వారికి మంత్రి పదవి ఇవ్వడం ఖాయమని,ఈ విషయంలో 'నారాయణ' తనకు అడ్డుపడకుండా ఉండేందుకే 'నారాయణ'ను 'సోమిరెడ్డి' దువ్వుతున్నారట. నెల్లూరు జిల్లాలో రెండో మంత్రి పదవి ఇచ్చే ప్రసక్తే లేదని మంత్రి నారాయణ కుండబద్దలుక ొట్టినట్లు చెబుతున్నారట. దీంతో ఖంగుతిన్న 'సోమిరెడ్డి' 'చంద్రబాబు'కు ఎలా దగ్గరై మంత్రి పదవి పొందాలో తెలియక కొంత మంది పాత్రికేయులను సలహా అడిగారట. పాత్రికేయులు ఎలాంటి సలహా ఇచ్చారో కానీ ఇటీవల కాలంలో ఆయన గొంతు వినిపించడం లేదు...మనిషి కనిపించడం లేదు..ఏం జరిగి ఉంటుందబ్బా...?

(605)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ