WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

చితక బాదుతున్న వెస్టిండీస్‌...!

వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి ట్వంట్వీ మ్యాచ్‌లో భారత్‌ బౌలర్లకు వెస్టిండీస్‌ బ్యాట్స్‌మెన్‌ చుక్కలు చూపిస్తున్నారు. టెస్టుల్లో పూర్తి ఆధిపత్యం సాధించిన భారత్‌ ట్వంటీ20లో మాత్రం తడబడుతోంది. వన్డే వరల్డ్‌ ట్వంటీ20 ఛాంపియన్‌ తనదైన శైలిలో చెలరేగిపోయింది. టాస్‌ గెల్చి ఫీల్డింగ్‌ ఎంచుకున్న 'ధోనీ'కి వెస్టిండీస్‌ బ్యాట్స్‌మెన్‌ సిక్స్‌లతో, ఫోర్లతో హడలెత్తిస్తున్నారు. పదిహేను ఓవర్లకే రెండు వందల పరుగులు చేసి తమ సత్తాను చూపిస్తున్నారు. ఇవిన్‌ లూయిస్‌ 9సిక్స్‌లు,ఐదు ఫోర్లతో 48 బంతుల్లో 100 పరుగులు చేసి సెంచరీ చేశాడు. ఛార్లెస్‌ 33బంతుల్లో ఆరు ఫోర్లు, ఏడు సిక్స్‌లతో 79 పరుగులు సాధించి మొదటి వికెట్‌కు 126 పరుగులు జోడించారు. 15 ఓవర్లు గడిచే సమయానికి వెస్టిండీస్‌ వికెట్‌ నష్టపోయి 199 పరుగులు చేసింది.

(302)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ