WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'పవన్‌' ప్రశ్నకు బదులేది...?

ప్రశ్నిస్తానన్న 'పవన్‌' మళ్లీ ప్రశ్నించాడు...ఆషా మాషీగా కాదు.. నాడు కాంగ్రెస్‌ నాయకుల పంచలూడదీసి కొడతానన్న 'పవన్‌' నేడు 'మోడీ దగ్గర నుంచి వెంకయ్యనాయుడు, 'చంద్రబాబు' 'జగన్‌, అశోక్‌గజపతిరాజు వరకూ అందరిన్నీ ఉతికి ఆరేశాడు..వీరూ వారని ఎవ్వరినీ వదలి పెట్టలేదు..ఆంధ్రాలో ఉండే నాయకులందరిని ముక్కుసూటిగానే ప్రశ్నించాడు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వడం లేదని...అటు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే...ఇటు మీరెందుకు పోరాడటం లేదని రాష్ట్రంలోని అన్ని రాజకీయపార్టీలను ప్రశ్నించాడు. సగటు ఆంధ్రా 'జనం'లో ఉన్న ప్రశ్నలన్నింటిని తిరుపతి వేదికగా చేసుకుని 'పవన్‌' సంధించాడు...? అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటిపోయినా ఇచ్చిన హామీలను ఎందుకు నిలబెట్టుకోవడం లేదని 'మోడీ' ప్రభుత్వాన్ని గట్టిగానే నిలేశాడు 'పవన్‌'. విభజన సమయంలో 'తల్లిని చంపి బిడ్డకు పురుడు పోశారన్న 'మోడీ' వ్యాఖ్యలను నేడు 'పవన్‌' గుర్తు చేస్తూ వాళ్లు 'తల్లిని చంపితే...మీరు ఆ శవానికి తెల్లగుడ్డ కప్పుకుతున్నారా? అంటూ తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. ప్రత్యేక హోదాకు ముగ్గురు సిఎంలు అడ్డుపడుతున్నారని చెబుతున్న కేంద్రం ఐదు కోట్ల మంది విభజన వద్దన్నా చేశారని, నేడు ముగ్గురు ఆపితే ప్రత్యేక హోదా ఆగుతుందా? అంటూ ఆయన కేంద్ర విధానంపై మండిపడ్డారు. నాడు పదిహేనేళ్లు ప్రత్యేక హోదా కావాలన్న 'వెంకయ్యనాయుడు' నేడు హోదాతోనే సమస్యలు పరిష్కారం కాదని నాలిక మడతేయడం ఏమిటని ఉతికి ఆరేశాడు. ఇది పద్దతి కాదని 'వెంకయ్య'ను హెచ్చరించారు. ఎన్నాళ్లూ సార్‌..సార్‌ అంటూ దేబిరించాలని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. అదే సమయంలో కేంద్రంలో మంత్రి పదవులు పట్టుకుని వేలాడుతున్నవారినీ ప్రశ్నించారు. మీరెందుకు మంత్రి పదవుల్లో కొనసాగుతున్నారని, ప్రత్యేక హోదా కంటే మంత్రి పదవే ముఖ్యమా? అన్న ఆయన ప్రశ్నకు బదులిచ్చేవారేరి? ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బాగానే కష్టపడుతున్నారని, కానీ ఆయన సిబిఐ భయంతోనే ప్రత్యేక హోదాపై గళం ఎత్తడం లేదన్న సంగతిని ఆయన 'జనం' సాక్షిగా ప్రశ్నించారు...ఇవన్నీ సామాన్య జనంలో ఉన్న ప్రశ్నలే? విభజన సమయంలో ఇస్తామన్న హామీని నెరవేర్చకపోతే ఎందుకు చేతులు ముడుచుకు కూర్చున్నారని ప్రతిపక్షాన్ని ప్రశ్నించారు. ఎంపిలు కేవలం వ్యాపారాలు చేసుకోవడానికే కాదని, ప్రజా సమస్యలపై స్పందించకపోతే పదవులు ఎందుకని ఆయన ప్రశ్నకు సమాధానం చెప్పగలిగే ఎంపి ఒకరైనా ఉన్నారా? మాట్లాడితే సిబిఐను ఉసిగొల్పుతారని భయపడుతున్న ఎంపీలు ఎటువంటి అవినీతి పనులు చేయకపోతే భయమెందుకు పడాలని, కేంద్రంలో ఉన్నవారేమైనా బ్రహ్మరాక్షుల్లా అని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికైనా రాష్ట్ర ఎంపిలు పార్లమెంట్‌ను స్థభింపచేయాలని ఆయన ఎంపిలను కోరారు... పోరాడితే పోయేదేమీ లేదన్న ఆయన మాటలను వ్యాపార ఎంపీలు పట్టించుకుంటారా?నాడు తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ ఎంపీలు ప్రత్యేక రాష్ట్రం కోసం గట్టిగాపోరాడితే ఆంధ్రా ఎంపీలు సోనియాగాంధీని చూసి జడుసుకున్నారని...మేడం..ప్లీజ్‌..ప్లీజ్‌ అంటూ ప్రాదేయపడి పరువు తీశారని ఆయన యాక్షన్‌ చేసి చూపించి కాంగ్రెస్‌ నాయకుల తీరును ఎండగట్టారు. మొత్తం మీద ప్రశ్నిస్తానన్న 'పవన్‌కళ్యాణ్‌' మరో మారు తనదైన శైలిలో కేంద్రం నుంచి రాష్ట్రం వరకూ అందర్నీ కడిగిపారేశారు..మరి ఆయన ప్రశ్నలకు జవాబులు ఇచ్చావారేరీ...?

(672)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ