WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

కొంప ముంచిన 'ధోనీ'...!

ఆరు బంతులకు ఏడు పరుగులు చేస్తే భారత్‌కు విజయం...పైన క్రీజ్‌లో ఉంది...టాప్‌మోస్ట్‌ ఫినిషర్‌ కెప్టెన్‌ ధోనీ... ఎన్నో మ్యాచ్‌లను ఒంటి చేత్తే గెలిపించిన ధోనీ ఈజీగా మ్యాచ్‌ గెలిపిస్తాడని భారత్‌ అభిమానులందరూ భావించారు..కానీ అనుకున్నది ఒకటి అయినది ఒకటి..ఆరు బంతుల్లో ఐదు పరుగులు మాత్రమే చేసిన భారత్‌ ఒక పరుగు తేడాతే వెస్టిండీస్‌పై ఓడిపోయింది. ఆఖరి ఓవర్‌ వేయడానికి వచ్చిన బ్రావో మొదటి బంతిని ఎదుర్కొన్న కెప్టెన్‌ ధోనీ ఆ బాల్‌ను మిడ్‌వికెట్‌వైపు లేపాడు..అక్కడే ఉన్న శ్యామూల్స్‌ చేతిలో బంతి పడింది.ధోనీ తాను అవుట్‌ అని భావించి క్రీజ్‌ వదలి వెళ్లడానికి సిద్ధం అయ్యాడు..కానీ శ్యామూల్స్‌ ఆ క్యాచ్‌ను సరిగా అందుకోలేకపోయాడు.దీంతో బతికిపోయిన 'ధోనీ' ఒక పరుగు పూర్తి చేశాడు. తరువాత బంతికి రాహుల్‌ ఒక పరుగు సాధించాడు... మళ్లీ ధోనీకి స్ట్రైకింగ్‌ వచ్చింది. మరో సింగిల్‌ తీసిన ధోని స్ట్రైకింగ్‌ రాహుల్‌కు ఇచ్చాడు. రాహుల్‌ మరో సింగిల్‌ తీయడంతో మూడు బంతుల్లో నాలుగు పరుగులు చేయాల్సి పరిస్థితి. ఐదవ బంతికి ధోనీ రెండు పరుగులు తీశాడు..చివరి బంతికి రెండు పరుగులు చేయాల్సిన ధోనీ మరోసారి శ్యామూల్స్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. ఈ సారి శ్యామూల్స్‌ ఎటువంటి పొరపాటు చేయకుండా బంతిని ఒడిసి పట్టుకున్నాడు. దాంతో స్టేడియంలో ఉన్న భారత్‌ అభిమానులు, టివిల ముందు ఉన్న ప్రేక్షకులు ఒక్కసారిగా మూగపోయారు. అంతకు ముందు వెస్టిండీస్‌ భారీ స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో వెస్టిండీస్‌ 245 పరుగుల భారీ స్కోరు సాధించింది. అయితే ఈ స్కోరును అందుకోవడానికి భారత్‌ గట్టిగానే కృషి చేసింది. ముఖ్యంగా రోహిత్‌శర్మ(62) రాకేష్‌ రాహుల్‌ (110)లు రాణించారు. అయితే చివరి ఓవర్‌లో 'ధోనీ' నిర్వాకంతో భారత్‌ పరాభవం కావాల్సి వచ్చింది.

(313)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ