WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'బావ'గారిని కలవండి...!

ఆయన అనేక సిద్ధాంతాలు కలిగిన రాజకీయనాయకుడు. ఉచిత సలహాలను బాగా ఇస్తారు..హరిదాసు-ఉల్లిపాయ సామెతలా బోధనలు చేస్తారు. తాను నిజాయితీపరుడైన రాజకీయ వేత్తనని, గొప్పలు చెప్పుకుంటారు. కానీ లంచాలు తీసుకోంది...ఏ పనీ చేయడం లేదని విమర్శలు కొని తెచ్చుకుంటున్నారు. ఇటీవల కొందరు వివిధ పనులపై ఆయనను కలవగా 'బావగారి'ని కలవండి అని ఉచిత సలహా పారేస్తున్నారు. విషయం ఏమిటని ఆరా తీయగా బావగారు కలెక్షన్లు చూస్తారు..ఈ నాయకుడు పనులు చక్కబెడుతుంటారు. వీరెవరో కాదు..సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రివర్గంలోని ఓ మంత్రివర్గ సహచరుడు. ఇటీవల కాలంలో ఆ మంత్రిని వివిధ పనులపై కలిసిన వారికి విచిత్రమైన సంఘటనలు, వింతైన అనుభవాలు ఎదురవుతున్నాయట. నిన్నటి వరకు కార్యాలయ అధికారులపై ఆధారపడ్డ ఈ మంత్రి పుంగవుడు తాజాగా 'బావగారి'పై ఆధారపడుతున్నారట. నిజాయితీ ముసుగులో అవినీతి లొసుగులా ఆ మంత్రి వ్యవహరిస్తున్న తీరుపై ఔరా అంటూ ఇతర మంత్రులు కూడా ముక్కుపై వేలేసుకుంటున్నారు. ఈ మంత్రిగారికి ఆదాయం వచ్చే మార్గాలను ముఖ్యమంత్రి మూసివేశారు. అయినప్పటికి కింద స్థాయిలో బావగారి ద్వారా కలెక్షన్లు వసూలు చేస్తున్నారు. దీనిపై ఆ శాఖాధిపతితో పాటు కమీషనర్‌ కూడా ముఖ్యమంత్రిని స్వయంగా కలసి మంత్రిగారి అవినీతి గుట్టు రట్టు చేయబోతున్నారు. విషయం తెలిసిన ఆ మంత్రి వారిద్దరికి ఎలా నచ్చ చెప్పాలో తెలియక ఎవరు చెబితే వారిద్దరూ వింటారు అనే మార్గాలు వెతుక్కుంటున్నారు. కానీ ఆ శాఖాధిపతి ఎవరి మాట వినడనే సంగతి ఆ మంత్రి ఇప్పటికీ తెలుసుకోలేకపోతున్నారు. ఈ మంత్రిగారి అవినీతి భాగోతం, బావగారి కలెక్షన్లు, సెలక్షన్లు ముఖ్యమంత్రి దృష్టికి వెళ్లాయట.

(477)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ