WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'అత్త' పేషిలో అల్లుడి దందా...!

ఆమె ఒక మహిళా మంత్రి. రాజకీయ కుటుంబం నుండి ఆమె రాజకీయాల్లోకి వచ్చారు. పుట్టింటోళ్లు, మెట్టినింటోళ్లు ప్రజాప్రతినిధులుగా ఎన్నికల్లో విజయం సాధించారు. ఆమెకు అదృష్టం కలిసి వచ్చి పుట్టింటోళ్లు ఉండే నియోజకవర్గంలో పోటీ చేసే అవకాశం లభించింది. కాంగ్రెస్‌ వ్యతిరేక గాలిలో ఆమె అవలీలగా విజయం సాధించి మహిళా కోటాలో మంత్రి పదవి పొందారు. నిజాయితీపరులైన రాజకీయకుటుంబాల నుండి వచ్చిన ఆమె మొదట్లో నిజాయితీగానే బాధ్యతలు నిర్వహించినప్పటికి, తాజాగా అల్లుడి రంగ ప్రవేశంతో భ్రష్టుపట్టిపోయారు. ప్రతిపైల్‌కు ఒక రేటును..మీరే నిర్ణయించండి..మీకు ఇంత..నాకు ఇంత..వసూలు చేయండి అని మంత్రి పేషీ అధికారులను అల్లుడి వాటా ముందుగానే చెబుతారు..మిగతా సొమ్మును పేషీ అధికారులు, ఇతర అధికారులు పంచుకుంటారు.ఇటీవల ఇద్దరుముగ్గురు మంత్రులు అధికార బదిలీలు,పోస్టింగ్‌లకు లిఖిత పూర్వకంగా సిఫార్సు చేశారు. సంబందించిన అధికారులు కూడా ఈ విషయం తెలిపారు. కానీ మంత్రి పేషీలో లంచాలు ఇవ్వనిదే సంబంధించిన సిఫార్సుల పేపర్లు బీరువాల్లో భద్రంగా పదిలపరిచారు. అదేమిటంటే అంటే మంత్రిగారు విజయవాడ వెళ్లారని అంటున్నారు. సొమ్ము చెల్లిస్తే సంబంధించిన సిఫార్సు పేపర్లను అధికారులకు పంపుతారు. ఈ రకంగా జరుతున్న ఈ బాగోతాన్ని మంత్రికి తెలుసో లేదో కానీ ముందుగా ఆమె దృష్టికి తీసుకెళ్లి ఎటువంటి చర్యలు తీసుకోకుంటే చివరికి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లేందుకు నిర్ణయం తీసుకున్నారు.

(579)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ