WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

పారదర్శకంగా బదిలీలు, పోస్టింగ్‌లు...!

హోంశాఖలో పోలీసు అధికారుల పోస్టింగ్‌లు,బదిలీలు పారదర్శకంగా నిర్వహించాలని, నిజాయితీకి,సమర్థతకు పెద్దపీట వేయాలని హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఎస్పీలకు, ఐజిలకు,డిఐజిలకు సూచించారు. ఇటీవల ఒక ప్రాంతంలో సిఐ పోస్టు కోసం వేలం పాట నిర్వహించారని, ఐదు లక్షల రేటు పలికిందని జరిగిన ప్రచారాన్ని హోంమంత్రి ఖండిస్తూ ఇంత వరకు ఆ ప్రాంతంలో ఎటువంటి నియామకాలు జరగలేదని, దీనిపై విచారణకు ఆదేశించానని చెప్పారు. రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, అమాత్యులు చేసిన సిఫార్సులకు సూచనలను ఎంత వరకు పరిగణలోకి తీసుకోవాలో అంతవరకే తీసుకుని సమర్ధులకు సముచిత స్థానం కల్పించాలని హోంమంత్రి పోలీసు అధికారులను కోరారు. ఈ రెండు సంవత్సరాల్లో తాను ఎంతో నిజాయితీగా, పకడ్బందీగా ఈ పోస్టింగ్‌ల వ్యవహారంలో కఠినంగా ఉంటున్నాని, మీరు కూడా అబాధ్యతలు నిర్వహించండి అని ఆయన పోలీసు అధికారులకు సూచించారు. డిఎస్పీ పోస్టుల బదిలీలు, పోస్టింగ్‌ల వ్యవహారాన్ని ముఖ్యమంత్రి పర్యవేక్షించబోతున్నారని దీంతో ఎలాంటి అవకతవకలు జరిగే అవకాశం లేవని, పోలీసు అధికారులు కూడా అదే విధంగా వ్యవహరించి ఈ శాఖకు వన్నె తేవాలని హోంమంత్రి కోరారు. వాస్తవానికి ఈ రెండేళ్లల్లో క్రింది స్థాయి నుండి అడిషనల్‌ ఎస్పీ స్థాయి వరకు జరిగిన పోస్టింగ్‌లు,బదిలీలలో హోంమంత్రి పాత్ర పరిమితమేనని సంబంధిత పోలీసు అధికారులు చెబుతున్నారు. ఇంతకు ముందు కన్నా ప్రస్తుతం ఈ బదిలీలు, పోస్టింగ్‌ల్లో తమకు అనేక టెన్షన్‌లు తగ్గాయని, విమర్శలు కూడా ఎవరూ చేయడం లేదని వివిధ జిల్లాల పోలీసు అధికారులు హోంమంత్రికి తెలియజేశారు. కఠినంగా వ్యవహరించే మనస్తత్వం కల పోలీసు అధికారి 'నండూరి సాంబశివరావు'ను డిజిపిగా నియమించడంతో పోలీసు అధికారులలో కొంత ఆనందం వ్యక్తం అవుతుంది. అటు ముఖ్యమంత్రి, ఇటు హోంమంత్రి ఈ బదిలీలు, పోస్టింగ్‌ల వ్యవహారంలో ఎక్కువగా కలగచేసుకోకుండా నిజాయితీపరులను, సమర్థులను ప్రోత్సహిస్తున్నారని పోలీసు అధికారులు కితాబు ఇచ్చారు. హోంమంత్రిగా రాజప్ప బాధ్యతలు నిర్వహించడం తమకు ఎంతో ఆనందంగా ఉందని సామాన్య రాజకీయనాయకునిగా అందరినీ కలుపుకుంటూ తమకు ఎటువంటి ఇబ్బందులు కల్గచేయని రాజప్పగారు మరో మూడేళ్లు ఈ శాఖకేమంత్రిగా ఉండాలని తాము మనస్వపూర్వకంగా కోరుకుంటున్నామని క్రిందిస్థాయి పోలీసు అధికారులతో పాటు సీనియర్‌ పోలీసు అధికారులు ఆఫ్‌ ది రికార్డుగా చెబుతున్నారు.

(282)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ