WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ఆ ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇవ్వవద్దు...!

అది రాజకీయ చైతన్యం కల జిల్లా. ఈ జిల్లాలో ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో చోటు లభించింది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా వివాదాల్లో తల దూర్చడం,కుటుంబ సభ్యులకు అధికారం అప్పచెప్పడంతో ఆ ఇద్దరు మంత్రులు అప్రదిష్టపాలయ్యారు. ఈ నేపథ్యంలో ఆ ఇద్దరు మంత్రులను పదవుల నుంచి తప్పిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. దీంతో ఆ జిల్లాచెందిన ఎమ్మెల్యేల్లో ఎక్కువ మంది ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారట. తమ జిల్లాలో మి ఇష్టం వచ్చిన వారికి మంత్రి పదవి ఇవ్వండి..కానీ ఫలానా ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇవ్వవద్దు. ఒక వేళ మీరు ఆయనకు మంత్రి పదవి ఇస్తే మేము రాజకీయంగా తప్పుకుంటాం అని చంద్రబాబుకు సొంతపార్టీ ఎమ్మెల్యేలే తేల్చి చెప్పారు. ఎందుకంత పంతం అంటే...అదంతే...! మాకు దక్కకు పోయినా ఫర్వాలేదు..ఆ ఎమ్మెల్యేకు మాత్రం మంత్రి పదవి ఇవ్వవద్దు. అసలు విషయం బయటకు పొక్కడం లేదు. మంత్రి వర్గ విస్తరణ ఎప్పుడు జరగనుందో సూచనాప్రాయంగా అయినా ముఖ్యమంత్రి చెప్పడం లేదు. కానీ త్వరలో మంత్రివర్గ విస్తరణ జరగడం ఖాయం. ఏ తేదీల్లో జరుగుతుందో మాకు అనవసరం.. కానీ ఆ ఎమ్మెల్యేకు మాత్రం మంత్రి పదవి రా కూడాదు..ఇది ఆ జిల్లాలో ఉన్న మెజార్టీ ఎమ్మెల్యేల అభిప్రాయం. దానిని చంద్రబాబు ఎంత వరకు పాటిస్తారో? ఎవరా ఎమ్మెల్యే...ఏమిటా కధ అని కొంత మంది పాత్రికేయులు తమతో సన్నిహితంగా ఉండే ఎమ్మెల్యేలను కలసి అడిగారట. ఆ పేరు వారు చెప్పారు..కానీ అది బయటకు రావద్దు..పత్రికల్లో ప్రచురించవద్దు అనే ఒప్పందం జరిగింది. ఇదే విషయాన్ని సిఎంఒ అధికారులను కొంత మంది పాత్రికేయులు ప్రశ్నించగా మాకేమీ తెలియదు..మేమేమీ వినలేదు...చూడలేదు..ఏదైనా విశేషం ఉంటే మీరే చెప్పండి...అని చల్లగా జారుకున్నారట..కానీ ఆ ఎమ్మెల్యే పేరు అందరికీ తెలుసు..? కానీ ఎవరూ బయటకు చెప్పరు..ఆ పేరు కూడా మా 'జనం ప్రత్యేక ప్రతినిధి'కి కూడా తెలుసు..కానీ..ఆ పేరు బయట పెట్టడం మాకు ఇష్టం లేదు.

(429)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ