WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

మంత్రివర్గ విస్తరణ రంగం సిద్ధం...!

త్వరలో జరగనున్న మంత్రివర్గ విస్తరణలో కూడికలు, తీసివేతలకు రంగం సిద్ధమైంది. మంత్రుల పనితీరుపై పలునివేదికలను తెప్పించుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాల తరువాత కానీ, లేక దసరా లోపు కానీ మంత్ర్రివర్గ విస్తరణ ఉంటుందని అంటున్నారు టిడిపికి చెందిన సీనియర్‌ నాయకులు. ఈ నేపథ్యంలో వివిధ జిల్లాల్లో ఎవరి మంత్రి పదవి ఉండబోతోంది...ఎవరి పదవి ఊడబోతోందన్న దానిపై 'జనంఆన్‌లైన్‌.కామ్‌' ప్రత్యేక కథనాలను ప్రచురిస్తోంది.

'మృణాళిని'పై వేటు ఖాయం...!

ముందుగా ఉత్తరాంధ్ర విషయాన్ని తీసుకుంటే ఇక్కడ నుంచి నలుగురు మంత్రి పదవుల్లో కొనసాగుతున్నారు. శ్రీకాకుళం జిల్లా ప్రస్తుతం మంత్రివర్గంలో ఉన్న అచ్చెంనాయుడును కొనసాగిస్తూనే సీనియర్‌ ఎమ్మెల్యే గౌతు శ్యామ్‌సుందర్‌ శివాజీకి మంత్రి పదవి ఇవ్వాలని సిఎం భావిస్తున్నారు. అచ్చెంనాయుడు పనితీరుపై విమర్శలు వస్తున్నప్పటికీ ఇప్పట్లో ఆయనపై వేటు అవకాశం లేదు. అటు అసెంబ్లీలోనూ ఇటు ప్రతిపక్షాలను ధీటుగా ఎదుర్కోవడంలో 'అచ్చెం' తీరుకు ముచ్చట చెందిన చంద్రబాబు ఆయనపై కరుణ చూపిస్తున్నారు. దాంతో ఆయనపై వేటు పడే అవకాశమే లేదు. విజయనగరం జిల్లా నుంచి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్న కిమిడి మృణాళిని మంత్రివర్గం నుంచి తొలగిస్తారని చెబుతున్నారు. మంత్రిగా అటు జిల్లాలోనూ శాఖాపరంగానూ ఆమె పట్టుసాధించలేకపోయారు. అంతేకాకుండా ఆమె చుట్టూ ఉన్న కుటుంబం సభ్యులు, ఇతర అంతరంగికుల అవినీతిపై 'జనం' కోడై కూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమెను మంత్రి పదవి నుంచి తొలగించి, గిరిజన వర్గానికి చెందిన ఎమ్మెల్సీ సంధ్యారాణికి మంత్రి పదవి కట్టబెట్టే అవకాశాలు ఉన్నాయి. మృణాళిని సామాజికవర్గానికి చెందిన భీష్మాచార్యుడైన ఎమ్మెల్యే నారాయణస్వామికి మంత్రి పదవి ఇచ్చి గౌరవించాలని చంద్రబాబుకు పలువురు సూచించినట్లు తెలిసింది. విశాఖ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న గంటాశ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడు పదవులకు వచ్చిన ముప్పేలేదు. కాగా పాయకరావుపేట ఎమ్మెల్యే అనిత తనకు మంత్రి పదవి ఖాయమని ప్రచారం చేసుకుంటున్నారు. ఉత్తరాంధ్రకు చెందిన మూడు జిల్లాల్లో మంత్రి మృణాళిని తప్పించి మరో ఇద్దరు లేదా ముగ్గురుకు మంత్రి పదవులు ఇచ్చే అవకాశం ఉంది.

(384)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ