WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

కృష్ణాలో 'కొల్లు' అవుట్‌...తాతయ్య, 'బొండా' ఇన్‌...!

కృష్ణా జిల్లాలో మంత్రివర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఇద్దరు మంత్రుల్లో ఒకరైన 'కొల్లు' రవీంద్రపై వేటు పడే అవకాశం ఉంది. మరో మంత్రి అయిన జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును మంత్రివర్గంలో కొనసాగిస్తారనడంలో సందేహం లేదు. జలవనరులశాఖపై పట్టుసాధించిన మంత్రి ఉమ అధికారులను పరుగులు తీయిస్తున్నారు..కాగా మరో మంత్రి 'కొల్లు' పనితీరు నిరుత్సాహకరంగా ఉందని 'చంద్రబాబు' అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నిజాయితీపరుడైన మంత్రిగా ఆయన చెప్పుకుంటున్నారే తప్ప...ఇతరులు ఎవరూ ఆయనకు అనుకూలంగా కానీ,లేక వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం లేదు. అయితే ఎక్సైజ్‌శాఖలో భారీ ఎత్తున్న ముడుపులు చేతులు మారాయని పలువురు విమర్శలు చేసినప్పుడు...తాను అవినీతికి పాల్పడినట్లు తేలితే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఛాలెంజ్‌ విసిరారు. కానీ ఆయన పనితీరు 'బాబు'కు నచ్చడం లేదు. ఈ నేపథ్యంలో 'జగ్గయ్యపేట' ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్యకు అవకాశం లభిస్తుందని పార్టీవర్గాలు చెబుతున్నాయి. గతంలో కాంగ్రెస్‌లో పార్టీ నుంచి మున్సిపల్‌ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించిన 'తాతయ్య' టిడిపిలో చేరి 'జగ్గయ్య' పేట నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. వైశ్య సామాజికవర్గానికి చెందిన ఆయనకు మంత్రి పదవి ఇచ్చి వైశ్యులను ఆకట్టుకోవాలనే ఉద్దేశ్యంతో 'బాబు' ఉన్నారు. ఒక వేళ కాపులకు ప్రాధాన్యత ఇవ్వాలని 'చంద్రబాబు' అనుకుంటే విజయవాడ సెంట్రల్‌ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావుకు అవకాశం దక్కుతుంది. ఆయనకు పదవి ఇస్తే జనసేన పార్టీ నాయకుడు 'పవన్‌కళ్యాణ్‌'ను కూడా సంతృప్తి చెందుతారు. ఈ విషయం పరిగణలోకి తీసుకుంటే 'బొండా'కు మంత్రి పదవి ఖాయమే.

(957)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ