WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ప్రకాశంలో 'శిద్దా' అవుట్‌...మాగంటి ఇన్‌...!

ప్రకాశం జిల్లాలో రెడ్డి సామాజికవర్గం ప్రభావం ఎక్కువగా ఉండడంతో గత ఎన్నికల్లో 'జగన్‌' పార్టీ హవా కనిపించింది. ఆ సామాజికవర్గ ఓటర్లను రాజకీయంగా ప్రభావితం చేయగల సత్తా మాగంటి శ్రీనివాసరెడ్డికే ఉందనేది 'చంద్రబాబు' నమ్మకం. వైశ్య కులానికి చెందిన 'శిద్దారాఘరావు'కు ప్రాధాన్యత కలిగిన రోడ్లు,రవాణా మంత్రి పదవి ఇచ్చినప్పటికీ ఆయా శాఖలపై ఆయన పట్టు సాధించలేకపోయారు. అంతే కాకుండా ఇటీవల కాలంలో ఆయన కుటుంబ సభ్యుల ప్రమేయం ఎక్కువగా కనిపిస్తోంది. ఒకప్పుడు లంచాలు ఆశించేవారు...తన కార్యాలయంలో పనిచేయవద్దని...నిజాయితీగా ఉంటే తన దగ్గర ఉండాలని చెప్పిన 'శిద్దా' దాన్ని పాటించడం లేదు. పేషీ అధికారులు, కుటుంబ సభ్యులు అవినీతికి పాల్పడుతున్నారని విమర్శలు వస్తున్నాయి. దీంతో 'శిద్దా'పై వేటు పడడం ఖాయమని స్పష్టమవుతోంది. ప్రకాశం జిల్లా ప్రజల్లో 'మాగంటి' కుటుంబంపై అభిమానం ఉంది. దాన్ని అనుకూలంగా మలుచుకోవడానికి చంద్రబాబు 'మాగంటి'కి పదవి ఇవ్వాలని భావిస్తున్నారట. ఒంగోలు నుంచి గెలిచిన ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్‌ మంత్రి పదవి ఆశిస్తున్నారు. కానీ ఆయనకు ఆ అవకాశం దక్కపోకవచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి శిద్దాను తొలగించి 'మాగంటి'కి లైన్‌క్లియర్‌ అవుతుందని ఆ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు చెబుతున్నారు.

(567)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ