WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'సోమిరెడ్డి'కి అవకాశం దక్కేనా...?

రెడ్డి సామాజికవర్గం అధికంగా ఉన్న నెల్లూరు జిల్లాలో ఆ సామాజికవర్గానికి చెందిన వారెవరూ టిడిపి తరుపున విజయం సాధించకపోవడంతో మంత్రి పదవి ఆ సామాజికవర్గానికి దక్కలేదు. విద్యావ్యాపరంతో ఆర్థికంగా ఎంతో ఎత్తుకు ఎదిగిన నారాయణ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సన్నిహితంగా మెలిగి ముందుగా మంత్రి పొంది తరువాత ఎమ్మెల్సీ అయిన విషయం తెలిసిందే. కాపు వర్గానికి చెందిన 'నారాయణ'కు మంత్రి పదవి ఇవ్వడంతో నెల్లూరు జిల్లాకు చెందిన 'రెడ్డి' సామాజికవర్గం అఎక్కింది. ఇటీవల టిడిపిలో చేరిన 'ఆనం' సోదరులు తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ఇక్కడ టిడిపి దూసుకపోవాలంటే తమ సామాజికవర్గానికి చెందిన వారికి అవకాశం ఇవ్వాలని వారు కోరుతున్నారు. 'ఆనం' కుటుంబానికి అవకాశం ఇవ్వడానికి 'చంద్రబాబు' సిద్ధంగా లేరు. మూడుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి పరాజయం పాలయి, తరువాత ఎమ్మెల్సీగా ఎన్నికైన 'సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి' మంత్రి పదవి ఆశిస్తున్నారు. 2014లో ఎంపిగా కేవలం పదివేల ఓట్ల తేడాతో ఓడిపోయిన మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డికి మంత్రి పదవి ఇస్తే ఆ సామాజికవర్గానికి చెందిన ముఖ్య నాయకులెవరూ అభ్యంతరం వ్యక్తం చేయరు. దీనిపై చంద్రబాబు ఎలా స్పందిస్తారనేది తెలియడం లేదు. 'సోమిరెడ్డి'కి మంత్రి పదవి ఇస్తే మళ్లీ గత పరిస్థితి (జిల్లాలో పార్టీ పూర్తిగా దెబ్బతింది) అదే పరిస్థితి వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈ జిల్లాలో నూతనంగా ఎవరికి మంత్రి పదవి ఇవ్వాలనే దానిపై కసరత్తు చేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో 'చినబాబు' కల్పించుకుంటే అది ఎవరికి మేలు చేస్తుందో ఇప్పటికిప్పుడు చెప్పలేం. వెంకటగిరి ఎమ్మెల్యే రామకృష్ణ వరుసగా రెండుసార్లు విజయం సాధించినా ఆయన 'చంద్రబాబ' సామాజికవర్గానికి చెందిన వారు కావడంతో ఆయన మైనస్‌ అవుతుందని అంటున్నారు. రెడ్డి, కమ్మ సామాజికవర్గాలకు మంత్రి పదవి ఇవ్వాలని 'బాబు' భావిస్తే 'రామకృష్ణ'కు అవకాశం వస్తుంది. ఉదయగిరి ఎమ్మెల్యే గురవయ్యనాయుడు 'కమ్మ' సామాజికవర్గానికి చెందిన వారైనా ఆయనకు మంత్రి పదవి దక్కదని ఆ జిల్లాకు చెందిన మెజార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన 'మాగంటి శ్రీనివాసరెడ్డి'కి ప్రకాశంలో మంత్రి పదవి ఇవ్వబోతున్నారని... తనకు కూడా అవకాశం ఇస్తే నష్టమేమిటని రామకృష్ణ వాదిస్తున్నారు.

(553)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ