WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'ఆలి'ని ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టిన భర్త...!

'సత్యహరిశ్చంద్ర' అనే నాటకంలో హరిశ్చంద్రుడు అనే రాజు సత్యం కోసం సొంత భార్యనే అమ్మకానికి పెట్టి సత్యాన్ని నిలబెట్టాడు. ఎన్ని కష్టాలు ఎదురయినా ఆడినమాట తప్పనివాడిగా చరిత్రలో అతని పేరు నిలిచిపోయింది. ఆయన సత్యాన్ని రక్షించేందుకు భార్యను అమ్మితే...నేడు ఓ ప్రబుద్ధుడు తన భార్య తనను పట్టించుకోవడం లేదని, ఆమెకు దైవభక్తి లేదనిఈకామర్స్‌ వెబ్‌సైట్‌ ఈబేలో అమ్మకానికి బేరం పెట్టాడు. నాడు సత్యహరిశ్చంద్రడు తన భార్య గుణగణాలకు వారణాసి పౌరులకు తెలిపి ఆమెను కొనుక్కోమని కోరాడు. ఇప్పుడు అదే రీతిలో ఈ ప్రబుద్ధుడు తన భార్య గుణగణాలను ఈబేలో వివరించాడు. తన భార్య లీండ్రా బాగా నవ్వుతుందని, మంచి బాడీ వర్క్‌, చక్కని బాడీ షేప్‌లు ఉన్నాయని ఆమె అందాలను వర్ణించాడు ఇతగాడు. ఆమెను దక్కించుకున్న వారు అదృష్టవంతులని, ఆమె చాలా మంచిదని పేర్కొన్నాడు. జోకెర్‌ సిమిన్‌ చేసిన ఈ అమ్మకం ప్రకటనకు నెట్‌ జనుల నుంచి విపరీతమైన స్పందన వస్తోంది. ఇప్పటికే ఆమెకు 65,880 పౌండ్లు బిడ్డు వచ్చాయట. ఈ విషయం తెలిసిన ఆయన భార్య సిమిన్‌ను చంపేస్తానని హెచ్చరిస్తోందట. మొత్తం మీద ఆన్‌లైన్‌లో భార్య అమ్మకానికి నెటిజన్ల నుంచి అనూహ్య స్పందన వచ్చిందట.

(776)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ