WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

రూ.200కోట్లు వద్దన్న 'పవన్‌'...!

ఈ రోజుల్లో రాజకీయాల్లో ఉన్న రాజకీయనాయకుల్లో నూటికి 99మంది డబ్బు కోసం ఎగబడేవారే. ఎంత దొరికితే అంత దోచుకుందామనుకునేవాళ్లే... ఇటువంటి వాతావరణంలో ఓ యువనేతకు రూ.200కోట్లు ఇస్తామని ఓ పారిశ్రామికవేత్త ఆఫర్‌ ఇచ్చాడ. అయితే ఆ సొమ్ము తనకు వద్దని ఆ యువనేత నిక్కచ్చిగా చెప్పాడట. ఇంతకీ అటువంటి అణిముత్యం ఎవరనేకదా...మీ ప్రశ్న...ఇంకెవరండీ...మన పవర్‌స్టార్‌ 'పవన్‌కళ్యాణ్‌'. సమాజానికి ఏదో మేలు చేయాలని ఎప్పుడు పరితపించే 'పవన్‌' ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ ఇటీవల వరుసగా సభలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సభకు ప్రజల నుంచి విపరీతమైన స్పందన వస్తోన్న విషయమూ తెలిసిందే. 'పవన్‌'కు 'జనం'లో ఉన్న పలుకుబడిని చూసిన ఓ పారిశ్రామికవేత్త ఆయన పార్టీకి రూ.200కోట్లు విరాళంగా ఇస్తానని ప్రకటించారట. అయితే ఈ విరాళం తీసుకోవడానికి 'పవన్‌' నిరాకరించాడట. పార్టీ ఫండ్‌గా అంత సొమ్ము వస్తుంటే ఇతరులైతే ఎగిరి గంతేసి తీసుకునేవారే. కానీ 'పవన్‌' ఆ అంకెను చూసి చలించలేదట. విరాళం ఇస్తానన్న పారిశ్రామికవేత్త ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించాడట. తనకు విరాళాలు వద్దని...తన సొమ్మే ఖర్చు చేస్తానని ఆయన చెప్పారట. ఇప్పటికే తన వద్ద చిల్లిగవ్వలేదని చెప్పుకున్న 'పవన్‌' రాబోయే ఎన్నికల్లో పోటీ చేయడానికి ఉత్సాహపడిపోతున్నారు. మరి అటువంటి సమయంలో విరాళాలు తిరస్కరిస్తే ఎన్నికల్లో ఎలా గెలవగలరని ఆయన సన్నిహితులు ప్రశ్నిస్తున్నారట. అయితే అటువంటి సొమ్ము తనకు వద్దని...సొంతంగా తాను సంపాదించిన సొమ్మునే ఎన్నికల్లో ఖర్చుచేస్తానని ఆయన చెబుతున్నారట. మొత్తం మీద ఈ భారీ ఆఫర్‌ను తిరస్కరించి 'పవన్‌' నూతన రాజకీయాలకు అంకురార్పణ చేసినట్లైంది.

(678)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ