WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

మౌనమేలనేయీ...!

ఒకప్పుడు చంద్రబాబుకు నమ్మినబంటు. పార్టీ శిక్షణాతరగుతుల సమయంలో బాధ్యతలన్నీ ఆయనకే అప్పచెప్పారు చంద్రబాబు. ఆయన ఎన్నికల్లో గెలిస్తే ప్రతిపక్షంలో కూర్చోవడం ఖాయమని టిడిపి వర్గాల నమ్మకం. ఆ నమ్మకం రెండు సార్లు నిజమైంది. ఆయన ఎవరో కాదు..అనంతపురం జిల్లాకు చెందిన సీనియర్‌ టిడిపి నేత 'పయ్యావుల కేశవ్‌'. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పటి అధికారపక్షం నాయకులతో లోపాయికారిగా ఒప్పందాలు కుదుర్చుకుని వారితో వ్యాపార లావాదేవీలు నిర్వహించి కోట్లు గడించారని విమర్శ ఉంది. దానిని అనేకసార్లు ఆయన ఖండించినప్పటికీ జిల్లా వాసులు ఎవరూ నమ్మడం లేదు. ఒకసారి జెసి కెశవ్‌గా...మరోసారి నీలకంఠం కేశవ్‌గా ఆయన ఆ పేరు ప్రచారంలోకి వచ్చింది. ఆ విధంగా ఆయన ఆ రాజకీయ నాయకులతో సంబంధాలు పెట్టుకున్నారని అధికారపార్టీ వర్గాలే ఆఫ్‌ ది రికార్డుగా తీవ్రంగా దుయ్యబట్టాయి. 1999 ఎన్నికల్లో 'కేశవ్‌' ఎమ్మెల్యేగా ఓడిపోవడంతో 'చంద్రబాబు' రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు. 2004, 2009ల్లో 'పయ్యావుల' గెలవడంతో 'చంద్రబాబు' ప్రతిపక్షనేతగా ఉండాల్సి వచ్చింది. 2014 ఎన్నికల్లో 'కేశవ్‌'కు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వవద్దని ఆయన గెలిస్తే పార్టీ అధికారంలోకి రాదని..కొందరు జిల్లా టిడిపి నేతలు 'చంద్రబాబు'కు గట్టిగా చెప్పారట. దాన్ని ఆయన పట్టించుకోలేదు..'కేశవ్‌'కు పోటీ చేసే అవకాశం ఇచ్చారు.. అదృష్టం 'బాబు'కు కలసి వచ్చింది. 'కేశవ్‌' ఓడిపోయారు..చంద్రబాబు సిఎం అయ్యారు...అప్పట్లో 'కేశవ్‌'ను గెలిపించే ప్రసక్తే లేదని ఆయన గెలిస్తే మా నాయకుడు చంద్రబాబు ముఖ్యమంత్రి కాలేరని ఆ నియోజవర్గ టిడిపి అభిమాన ఓటర్లు బాహాటంగానే చెప్పారట. ఓటర్లు 'కేశవ్‌'ను ఓడించి...తమ నాయకుడికి అధికారం వచ్చేటట్లు చేశారని జిల్లా నాయకులు వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 'పయ్యావుల' పోటీ చేయకుండా ఉండాలంటే ఆయనను రాజ్యసభకు కానీ, కౌన్సిల్‌కు పంపాలని 'చంద్రబాబు' ఆలోచించారట. రాజ్యసభకు పంపితే ఢిల్లీ స్థాయిలో తన వ్యతిరేకులతో కుమ్మక్కై అయినా అవచ్చని..అనుమానంతో ఆయనను ఎమ్మెల్సీగా పోటీ చేయించి గెలిపించారు. మంత్రి పదవి వస్తుందని ఇంటా బయటా ప్రచారం చేసుకున్నారు.. ఒక సమయంలో 'కేశవ్‌'కు మంత్రి పదవి ఖాయమని సిఎంఒ వర్గాలు కూడా భావించాయి. కానీ ఇంతలో ఏం జరిగిందో ఎవరికి తెలియదు..'పయ్యావుల'పై 'చంద్రబాబు' తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేశారో బయటకు రాకపోయినా 'కేశవ్‌' మాత్రం ఇటీవల కాలంలో సిఎం కార్యాలయంలో కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో తనకు మంత్రి పదవి దక్కదని తెలుసుకున్న 'కేశవ్‌' మౌనం పాటిస్తున్నారట.

(519)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ