WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ప్యాకేజీ డబ్బా పాలవంటిది...!

ఆయన చిత్ర విచిత్రమైన రాజకీయనాయకుడు. రకరకాల వేషాలు వేస్తుంటారు.. అప్పుడప్పుడూ పురాణపురుషుల ఏకపాత్రాభినయంలో జీవిస్తుంటారు. ఇంటా బయటా చిత్రవిచిత్ర వేషాలు వేసి అటు రాజకీయవర్గాలను ఇటు ప్రజలను ఆలోచింపచేస్తారు. చంద్రబాబుకు అత్యంత విశ్వాసపాత్రుడిగా ఆయనకు ఆయనే వర్ణించుకుంటారు. తాజాగా ప్రత్యేకప్యాకేజీపై మాట్లాడుతూ హోదా తల్లిపాలవంటిది...ప్యాకేజీ డబ్బా పాలవంటిదని అన్నారు. చాలా మంది తల్లులు పిల్లలకు తల్లిపాలు ఇవ్వకుండా డబ్బాపాలు ఇస్తున్నట్లు ఆయన తేల్చేశారు. అందరం సమైక్య ఆంధ్రా కోసం పోరాడామని, లోక్‌సభలో తలుపులు మూసి బిల్లును ఆమోదించారని, ఎంత పోరాడినా విభజన ఆగలేదని చెబుతూ ప్రస్తుతం ఈ హోదా విషయంలో కూడా రకరకాల ఇబ్బందులు ఉన్నాయని, ఈ రెండు సంవత్సరాలు ఎంతో ఆలోచించిన కేంద్ర పాలకులు ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యపడదని గుర్తించి ప్యాకేజీ ప్రకటించారని, ఈ ప్యాకేజీతో రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లడానికి సాధ్యపడుతుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాత్రమే కేంద్ర ప్యాకేజీతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలరని చెప్పారు. తాను ప్రత్యేక హోదా కోసం లోక్‌సభ సమావేశాల సమయంలో పలు విధాలుగా ప్రయత్నించానని, ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయాన్ని ఆధారాలతో చూపించానని ఆయన చెబుతూ ఎవరెవరు నష్టపరిచారు..ఎవరెవరు లాభం చేకూర్చారనేది ప్రజలకు తెలుసనని అన్నారు. సినీ హాస్యనటుడిగా జీవితాన్ని ప్రారంభించిన డాక్టర్‌ శివప్రసాద్‌ నగరి ఎమ్మెల్యే రోజాను హీరోయిన్‌గా తెరపైకి తీసుకువచ్చారు. 1999లో ఎమ్మెల్యేగా విజయం సాధించి ఆయన సమాచారశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2009, 2014ల్లో చిత్తూరు ఎంపిగా ఆయన విజయం సాధించి తన దైన శైలిలో ఆయన ముందుకెళ్తున్నారు. కాగా తాను అభివృద్ధి పనులు చేస్తుంటే అధికారుల నుంచి సహకారం అందడం లేదని ఆయన ఆరోపిస్తున్నారు. 'శివప్రసాద్‌' చేసిన ప్రకటన వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కొందరు అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళితే ఆయన వాటిని కొట్టిపారేశారు.

(453)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ