WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

నా పదవికి ఢోకా లేదు...!

ఆమెకు 2014 ఎన్నికల్లో అదృష్టం కలసి వచ్చి పొరుగు నియోజకవర్గంలో పోటీ చేసే అవకాశం కల్గింది. ఆ జిల్లాలో తెలుగుదేశం గాలి బలంగా వీచడంతో మొత్తం నియోజకవర్గాల్లో టిడిపి పార్టీ అభ్యర్థులే విజయం సాధించారు. కులంతోపాటు ఇతర అంశాలు ఆమెకు కలసి వచ్చాయి. మంత్రి పదవి వరించింది. దాంతో సంతృప్తి పడక కుటుంబ సభ్యులను పాలనాయంత్రాంగంలో కలగచేసుకునేటట్లుగా ప్రోత్సహించారని విమర్శలు కొని తెచ్చుకున్నారు. ఈ రెండు సంవత్సరాల్లో ఆమెపై ఎన్నో ఆరోపణలు వచ్చాయి. కానీ ఆ ఆరోపణలను ఆమె ఖండిస్తూ తాను దళిత మహిళా మంత్రిని కాబట్టి కొంత మంది కావాలని బురదజల్లుతున్నారని ఎదురు దాడి చేశారు. ప్రతి మంత్రికి రెండేళ్లు సమయం ఇస్తానని, ఈ లోగా వారి సమర్థతను నిరూపించుకోవాలని అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పదే పదే చెప్పడంతో ఆ మంత్రికి కాలం కలసి వచ్చింది. ఇటీవల కొన్ని పత్రికలు, ఆన్‌లైన్‌ వెబ్‌సైట్లు ఆమెను మంత్రి పదవి నుంచి తొలగించడం ఖాయమని కథనాలు ప్రచురించాయి. దీనిపై ఆమె స్పందిస్తూ ఐదేళ్లు మంత్రిగా తాను కొనసాగుతానని, తాను సమర్థవంతంగా, నిజాయితీగా బాధ్యతలు నిర్వహించానని, పత్రికల కథనాల్లో వాస్తవం లేవని దుయ్యబట్టారు. ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలో మరో సమాజికవర్గానికి మంత్రి పదవి ఇచ్చేందుకు సిఎం చంద్రబాబు నిర్ణయించుకున్నారు. దీంతో 'అమ్మగారి' మంత్రి పదవి గోవిందా...అయ్యగారికి మంత్రి పదవి రానుందా? అని ఆ జిల్లా ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల ప్రతినిధులు బాహాటంగా చర్చించుకుంటున్నారు. అనవసరంగా చర్చను ప్రారంభించి అభాసుపాలయిన ఆ మహిళా మంత్రికి సహచరులెవరూ సానుభూతి వ్యక్తం పరచడం లేదట. ఇప్పటికే రెండేళ్లు ఆమె మంత్రిగా ఉండడం అదృష్టం...అయినా ఆమెకు తృప్తి లభించలేదట. ఏది ఏమైనప్పటికి ఆమె ఎటువంటి ప్రకటనలు చేసినప్పటికీ మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు జరిగినా ఆమె మాజీ కాక తప్పదని జిల్లా టిడిపి నాయకులే అంటున్నారు.

(366)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ