WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ఆయనకు మంత్రి పదవి ఖాయం...!

ఆయన నిజాయితీపరుడైన రాజకీయనాయకుడు. అటు రాజకీయవర్గాల్లో, ఇటు అధికార వర్గాల్లో, ఉద్యోగవర్గాల్లో ఆయనకు మంచిపేరు ప్రతిష్టలు ఉన్నాయి. ఏ ప్రభుత్వ కార్యాలయానికి ఆయన వెళ్లినా పనులు చక చకా జరిగిపోతుంటాయి. ఆయనంటే వారందరికీ అంత గౌరవం. ఆయన ఎవరో కాదు.. పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గానికి చెందిన 'శివరామరాజు'. త్వరలో జరగనున్న మంత్రివర్గవిస్తరణలో 'శివరామరాజు' తీసుకోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. అన్ని వర్గాల ద్వారా రహస్య విచారణ జరిపి ఎవరెవరిని మంత్రివర్గంలోకి తీసుకోవాలో...ఎవరెవరిని మంత్రి పదవుల నుండి తొలగించాలో అనే విషయంపై ఆయన ఒక నిర్ణయానికి వచ్చారు. ఆ నిర్ణయంలో మొదటి పేరును 'ఉండి' ఎమ్మెల్యే శివరామరాజుదేనని విశ్వసనీయవర్గాల సమాచారం. 2009, 2014 ఎన్నికల్లో విజయం సాధించిన 'శివరామరాజు' అందరికీ అందుబాటులో ఉంటారనే పేరు ఉంది. సొంత సొమ్మును ఖర్చుపెట్టి పలువురికి సహాయసహకారాలు అందిస్తారని ఆ నియోజకవర్గ స్థానిక సంస్థల ప్రతినిధులతో పాటు ఇతరులు కూడా చెబుతుంటారు. క్షత్రియ సామాజికవర్గానికి మంత్రి పదవి ప్రస్తుత క్యాబినెట్‌లో లేదు. ఇది కూడా 'శివరామరాజు'కు కలిసి వచ్చింది. నిజాయితీతో పాటు ఇతర విషయాలను కూడా పరిగణలోకి తీసుకోగా పశ్చిమగోదావరి జిల్లాలో ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే మంత్రి పదవులకు అర్హులుగా చంద్రబాబు భావిస్తున్నారు. వారిలో 'తణుకు' ఎమ్మెల్యే రాధాకృష్ణ, భీమవరం ఎమ్మెల్యే రామాంజనేయులు, ఉండి ఎమ్మెల్యే శివరామరాజులు ఉన్నారట. ముగ్గురు మూడు కులాలకు చెందిన వారు కావడంతో 'శివరామరాజు'కు మంత్రి పదవి ఇచ్చేందుకే చంద్రబాబు మొగ్గు చూపుతున్నారు. 'తణుకు' ఎమ్మెల్యే రాధాకృష్ణ 'కమ్మ' సామాజికవర్గానికి చెందిన వారు కాగా (మొదటిసారి మాత్రమే గెలిచారు) భీమవరం ఎమ్మెల్యే రామాంజనేయులు రెండుసార్లు విజయం సాధించారు.ఆయన కాపు సామాజికవర్గానికి చెందిన వారు. వీరిద్దరికి మంత్రి పదవుల అర్హత ఉన్నప్పటికీ కులాల సమతూకం వల్ల వారికి అవకాశాలు రాకపోవచ్చు. 'శివరామరాజు'కు మంత్రి పదవి ఇవ్వాలని జిల్లా అధికార, ఉద్యోగ వర్గాలు కూడా కోరుకుంటున్నాయంటే ఆయన ఎంత శాంతస్వభావుడో స్పష్టం అవుతుంది.

(420)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ