WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

10కోట్ల మంది చనిపోయినా చింత లేదు...!

నిరంతరం భారత్‌లో ఉగ్రవాదుల దాడులతో అల‌జ‌డి సృష్టిస్తోన్న పాకిస్తాన్‌పై యుద్ధం చేసి, ఆ దేశాన్ని స్వాధీనం చేసుకోవాలని...ఈ ప్రయత్నంలో 10కోట్ల మంది మరణించినా చింతలేదని టిడిపి ఎంపి జెసి దివాకర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం నాడు జమ్మూ-కాశ్మీర్‌లోని యూరి సెక్టార్‌లోని సైనిక స్థావరంపై ఉగ్రదాడి అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్‌-పాకిస్తాన్‌ యుద్ధంలో 10కోట్ల మంది చనిపోయినా బాధ లేదని, రోజూ చచ్చి బతికే కన్నా యుద్ధేమే శరణ్యమని, పాకిస్తాన్‌తో యుద్ధం చేసి ఆ దేశాన్ని భారత్‌లో కలిపేసుకోవాలని, దాంతో ఉగ్రవాద పీడ విరగడ అవుతుందని ఆయన అన్నారు. సైన్యానికి ఖర్చు చేసే వేల కోట్ల రూపాయలను అభివృద్ధి కోసం ఖర్చు చేయవచ్చని పేర్కొన్నారు. జాతిపిత మహాత్మాగాంధీ, జవహర్‌లాల్‌ నెహ్రూ తప్పిదాల వల్లే పాకిస్తాన్‌ సమస్య ఏర్పడిందని ఇప్పటికైనా కేంద్రంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం దీనిపై అమీ తుమీకి సిద్ధపడాలని ఆయన సూచించారు.

(723)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ