WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ఎమ్మెల్సీ బరిలో 'ఆదాల'...!

మరో ఐదు మాసాలలో శాసనమండలి ఎన్నికల హడావుడి అప్పుడే ప్రారంభమైంది. స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీగా పోటీ చేయాలనుకుంటున్న అభ్యర్థులు టిడిపి అధినేత చంద్రబాబును కలసి ఆయన ఆశీస్సులతో రంగంలోకి దిగారు. ఇతర పార్టీల నుండి టిడిపిలో చేరిన వారికి మళ్లీ పోటీ చేసే అవకాశం ఇవ్వకూడదని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. దీంతో కాంగ్రెస్‌, జగన్‌ పార్టీల నుండి స్థానిక సంస్థల ద్వారా ఎన్నికైన వారికి నిరుత్సాహం ఎదురైంది. ఈ విధమైన పరిస్థితి నెల్లూరు జిల్లాలో కనిపిస్తుంది. స్థానిక సంస్థల కోటా నుండి ఎమ్మెల్సీగా ఎన్నికైన వాకాడ నారాయణరెడ్డి 2014 ఎన్నికల్లో ఆ పార్టీ నెల్లూరు ఎంపి అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన అనంతరం టిడిపిలో చేరారు. మళ్లీ పోటీ చేసే అవకాశం తనకు ఇవ్వాలని 'నారాయణరెడ్డి' కోరుతున్నప్పటికీ...ఆ అవకాశం మాజీ మంత్రి 'ఆదాల ప్రభాకర్‌రెడ్డి'కి ఇవ్వనున్నట్లు ఆ జిల్లాలో ప్రచారం జరుగుతోంది. 2014 ఎన్నికల్లో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కేవలం రెండు నియోజకవర్గాలు మాత్రమే టిడిపి అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా విజయం సాధించగా, ఐదు నియోజకవర్గాల్లో 'జగన్‌' పార్టీ అభ్యర్థులు విజయం సాధించినప్పటికీ లోక్‌సభ టిడిపి అభ్యర్థి 'ఆదాల' కేవలం 10వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. దీనికి టిడిపి అభ్యర్థులుగా ఆత్మకూరుతో పాటు ఇతర నియోజకవర్గాల్లో పోటీచేసిన వారు ముఖ్యకారణమని అప్పట్లో విశ్లేషించారు. టిడిపి అధికారంలోకి రావడంతో ఎమ్మెల్యేగా గెలిచిన ముగ్గురిని కాదని ఆ జిల్లాకు చెందిన 'నారాయణ'కు మంత్రి పదవి ఇచ్చి ఆ తరువాత ఆయనను ఎమ్మెల్సీగా ఎంపికచేశారు. 'రెడ్డి' సామాజికవర్గం 'జగన్‌' వైపు ఎన్నికల సమయంలో మొగ్గు చూపడంతో మెజార్టీ సీట్లు ఆ పార్టీకి దక్కాయని, ఇప్పుడిప్పుడే ఆ వర్గంలో చీలిక కనిపిస్తుందని అధికారపార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో 'ఆనం' సోదరులను టిడిపిలోకి చేర్చుకోవడం జరిగింది. ఎమ్మెల్సీగా మీ సోదరుల్లో ఒకరు పోటీ చేస్తారా? అని 'ఆనం' సోదరులను పార్టీ కార్యకర్తలు ప్రశ్నించగా తాము భవిష్యత్‌ ఎన్నికల్లో పోటీ చేస్తామని తేల్చి చెప్పారు. దీంతో మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డికి లైన్‌క్లియర్‌ అయింది. ఎమ్మెల్సీగా పార్టీ అభ్యర్థి ఎవరైనప్పటికీ గెలిపిస్తామని 'ఆనం' సోదరులు ప్రకటించారు. అదే బాటలో పలువురు సీనియర్లు కూడా నడవబోతున్నట్లు చెప్పారు. ఎమ్మెల్సీ నారాయణరెడ్డి మళ్లీ టిక్కెట్‌ ఆశిస్తున్నప్పటికీ ఆయనకు ఏ వైపు నుంచి కూడా మద్దతు కనిపించడం లేదు. మూడు సార్లు వరుసగా ఎమ్మెల్యేగా విజయం సాధించిన 'ఆదాల' 1999లో 'బాబు' మంత్రివర్గంలో గృహనిర్మాణశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఆ తరువాత ఆయనను తొలగించి 'సోమిరెడ్డి'కి మంత్రి పదవి ఇవ్వటం జరిగింది. ఎన్నికల్లో మళ్లీపోటీ చేసే అవకాశం 'ఆదాల'కు దక్కదని 'సోమిరెడ్డి' వర్గీయులు ప్రచారం చేయటం, దాన్ని 'బాబు' ఖండిచకపోవడంతో 'ఆయన' కాంగ్రెస్‌లో చేరి టిడిపి అభ్యర్థి సోమిరెడ్డిపైనే పోటీ చేసి విజయం సాధించి సంచలనం సృష్టించారు. 2009లో కూడా 'సోమిరెడ్డి'ని మళ్లీ 'ఆదాల' ఓడించి 2014 ఎన్నికల ముందు టిడిపిలో చేరిపోయారు. రెండేళ్ల కిందటే 'సోమిరెడ్డి'కి ఎమ్మెల్సీ పదవి దక్కింది. స్థానిక సంస్థల కోటా నుండి ఎమ్మెల్సీగా పోటీ చేసేందుకు మరో టిడిపి నాయకుడు ఎవరూ ముందుకు రాకపోవడంతో 'ఆదాల' పోటీ చేయడం ఖాయమని తేలింది.

(353)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ