WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ప్లీజ్‌ మంత్రి పదవి ఇప్పించండి...!

నిన్నటి వరకు టిడిపి ప్రభుత్వాన్ని, చంద్రబాబును తీవ్రంగా దుయ్యబట్టి వార్తలకెక్కిన బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు మంత్రి పదవి కోసం పాకులాడుతున్నారట. బిజెపి అగ్రనాయకుల ద్వారా 'వీర్రాజు' ప్రయత్నాలు ప్రారంభించినప్పటికీ ఆయనకు వారెవరూ హామీ ఇవ్వలేదు. ప్రధాని మోడీ మాత్రమే ఆయనకు మంత్రి పదవి ఇవ్వాలని చెపితే 'బాబు' తప్పకుండా ఆయనకు మంత్రి పదవి ఇస్తారు. బిజెపి సీనియర్‌ నాయకులు, ఇతర ముఖ్యులు ఎవరు సిఫార్సు చేసినా 'చంద్రబాబు' ఖాతరు చేసే ప్రసక్తేలేదు. ఈ విషయం 'వీర్రాజు'కు తెలుసు. అందుకే గత కొన్ని నెలల నుంచి విమర్శల దూకుడు తగ్గించారు. దేవాదాయశాఖ మంత్రి మాణిక్యాలరావుపై అవినీతి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆయనను తొలగించడం ఖాయం. ఈ విషయం బిజెపి నేతలకు 'చంద్రబాబు' సూచనాప్రాయంగా చెప్పారట. మంత్రి మాణిక్యాలరావు పనితీరును కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కూడా తప్పుబడుతూ ఇచ్చిన అవకాశాన్ని చేజేతులారా పాడు చేసుకున్నావని చెప్పారట. దీన్ని బట్టి తన మంత్రి పదవి ఊడడం ఖాయమని మాణిక్యాలరావు భావిస్తున్నారట. దీంతో ఆయన సామాజికవర్గానికే చెందిన ఎమ్మెల్సీ సోము వీర్రాజు మంత్రి పదవి కోసం ముమ్మరంగా ప్రయత్నాలు ప్రారంభించారు. మాజీ కాంగ్రెస్‌ నాయకుల ప్రోద్బలంతో 'బాబు'పై 'సోము' చేసిన విమర్శలకు బిజెపి అగ్రనేతలు కూడా ఆగ్రహం వ్యక్తం చేసి హెచ్చరించడం కూడా జరిగింది. చంద్రబాబుతో మిత్రత్వం లాభమే కానీ, నష్టాలు ఉండవని, ఎందుకు మీరు అవాస్తవ విమర్శలు చేశారని బిజెపి అధ్యక్షుడు అమిత్‌షా కూడా 'సోము'ను తీవ్రంగా మందలించినట్లు ఆ పార్టీ నాయకులే బయటపెట్టారు. ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో ఏ పదవీ తాను ఆశించలేదని, ఇప్పటికైనా తన సీనియార్టీ, పార్టీ పట్ల తన సిన్సియారిటీని దృష్టిలో పెట్టుకుని మంత్రి పదవి ఇప్పించాలని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడును పదే పదే 'సోము' ప్రాధేయపడుతున్నారట. ఆయన చిరకాలకోరిక తీరుతుందే లేదో వేచి చూడాల్సిందే...!

(289)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ