WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'లోకేశ్‌'...నన్నేం అనలేదు..:రాజప్ప...!(వీడియో)

తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ తనను అవమానాలకు గురిచేశారని, 'జగన్‌' పార్టీ నాయకులు దుష్‌ప్రచారం చేస్తున్నారని, సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు తీసుకుంటానని హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప హెచ్చరించారు. శుక్రవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీయే తనకు సుప్రీం అని...పార్టీలో తాను కుటుంబసభ్యుడినని, నన్నెవరూ ఎప్పుడూ ఏమీ అనలేదని 'రాజప్ప' చెప్పారు. చంద్రబాబునాయుడుకు వీరవిధేయుడిగా తనకు పేరుందని, తాను నిజాయితీగా హోంశాఖామంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాని, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణపై ఉన్న కుంభకోణాలు తనపై లేవని రాజప్ప అన్నారు. 'జగన్‌' పార్టీ నాయకులు గ్లోబల్‌ ప్రచారాలు చేస్తున్నారని, తండ్రి ముఖ్యమంత్రి పదవిని అడ్డం పెట్టుకుని 'జగన్‌' ఎన్ని వేల కోట్లు అక్రమంగా సంపాదించారో అందరికీ తెలుసనని, ఇప్పటికీ ఆయన కోర్టులు చుట్టూతిరుగుతున్నది వాస్తవం కాదా? అని ఆయన దుయ్యబట్టారు. తనపై విమర్శలు చేస్తున్న మాజీ మంత్రి బొత్స 'జగన్‌' ఎదుట పిల్లిలా ఉంటారని ఆయన వ్యంగ్యంగా అన్నారు. 'జగన్‌' ముందు మాట్లాడే సత్సా 'బొత్స'కు ఉందా అని 'రాజప్ప' ప్రశ్నించారు. 'జగన్‌' వేధింపులు తట్టుకోలేకే ఆయన పార్టీ ఎమ్మెల్యేలు వీడిపోయారని, అయినా ఆయనలో మార్పు రావడం లేదని హోంమంత్రి విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై తప్పుడు ప్రచారం చేసేందుకే మాజీ మంత్రి బొత్సతో 'జగన్‌' కమిటీ వేశారని రాజప్ప విమర్శించారు. రాష్ట్రాభివృద్ధికి రాత్రింభవళ్లు చంద్రబాబు కృషి చేస్తున్నారని జాతీయస్థాయిలో ప్రశంసలు పొందుతుంటే రాష్ట్రాభివృద్ధిని 'జగన్‌'ను అడ్డుకుంటున్నారని హోంమంత్రి ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ తనకెంతో గుర్తింపు ఇచ్చిందని, ఇప్పటికీ...ఎప్పటికీ తాను పార్టీకి వీరవిధేయుడినే అని 'బొత్స' వలే పిల్లిమొగ్గలు వేయలేదని, అధికారం కోసం వెంపర్లాడే అ 'బొత్స'కు ఉందే తప్ప తనకు అల‌వాటు లేదని ఆయన దుయ్యబట్టారు.







(834)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ