నెరవేరిన చంద్రబాబు శపథం
రాష్ట్ర అసెంబ్లీలో తన భార్యను అవమానించారని, ఇది గౌరవ సభకాదు..కౌరవ సభ అంటూ..అసెంబ్లీని బాయ్‌కాట్‌చేసిన అప్పటి ప్రతిపక్షనాయకుడు నారా చంద్రబాబునాయుడు నేడు సగర్వంగా అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. తనను, తన భార్యను వైకాపా సభ్యులు అనగూడని మాటలు అనడంతో..కన్నీళ్లతో శాసనసభ నుంచి బయటకు వెళ్లిపోతూ, మళ్లీ ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలోకి అడుగుపెడతానని శపథంచేసిన చంద్రబాబు నేడు తన శపధాన్ని నెరవేర్చుకున్నారు. రాష్ట్రంలో ఎన్‌డిఏ ప్రభుత్వం ఏర్పడిన తరువాత జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలకు ఆయన హాజరయ్యారు. దాదాపు రెండున్నరేళ్ల తరువాత ఆయన అసెంబ్లీకి వచ్చారు. తనను, తన భార్యను కించపర్చడంతో..ఆ రోజు ఆయన బోరున విలపించారు. రాజకీయాలతో సంబంధం లేని తన భార్య వ్యక్తిత్వాన్ని హణనం చేయడంతో దుఖాఃన్ని దింగమింగుకోలేక ఆయన విలపించారు.అప్పట్లో ఇది రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు కారణమైంది. ఒక మహిళను అసెంబ్లీలో అనరాని మాటలు అన్నారని, మహిళలను వైకాపా ప్రభుత్వం, అప్పటి ముఖ్యమంత్రి జగన్‌లు అవమానపర్చాని, దానికి అసెంబ్లీ ఎన్నికల్లో గుణపాఠం చెప్పారని రాజకీయవిశ్లేషకులు భావిస్తున్నారు.
పేరు మర్చిపోయిన జగన్...!
కాగా..నేటి సమావేశాలకు అసెంబ్లీకి రాడనుకున్న మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి హాజరయ్యారు. ఆయనతో ప్రొటెం స్పీకర్ బుచ్చయ్యచౌదరి ప్రమాణస్వీకారం చేయించారు.వాస్తవానికి ఆయన నిన్న జరిగిన వైకాపా పార్టీ సమావేశంలో ప్రసంగిస్తూ తనను చంపుతామని స్పీకర్ పదవి చేపట్టే వ్యక్తి అంటున్నారని, అదే విధంగా మరి కొందరు దూషిస్తున్నారని, ఇటువంటి పరిస్థితుల్లో అసెంబ్లీకి వెళ్లడం అవసరమా..అన్నట్లు మాట్లాడారు. అయితే..ఈరోజు కాకపోతే..తరువాత ఆయనకు మరిన్ని ఇబ్బందులు వస్తాయని కొందరు సన్నిహితులు ఆయనకు సూచించారట. ప్రొటెం స్పీకర్ బుచ్చయ్యచౌదరి అయితే పెద్దమనిషి, మర్యాదగా వ్యవహరిస్తారని, అలా కాకుండా మరికొన్నాళ్లు వేచి చూస్తే నూతన స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడు వస్తాయరని, ఆయన ఇప్పటికే జగన్‌పై కించపరిచే వ్యాఖ్యలుచేశారు కనుక..ఆయన ముందుకు వెళ్లి ప్రమాణ స్వీకారం చేయడం ఇబ్బందిగా ఉంటుందనే భావనతో ఈ రోజే ఆయన అసెంబ్లీకి వచ్చారనే విశ్లేషణలు వస్తున్నాయి. ఒక వ్యక్తి ఎమ్మెల్యేగా ఎన్నికైన తరువాత కనీసం ఆరు నెలల లోపు ప్రమాణస్వీకారం చేయాల్సి ఉంటుంది. అలా చేయకపోయినా, ఆరు నెలల పాటు అసెంబ్లీకి రాకపోయినా ఆ వ్యక్తి శాసనసభ్యత్వం రద్దు అవుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే జగన్ ఈ రోజు అసెంబ్లీకి వచ్చారంటున్నారు. కాగా తనను రాజధాని రైతులు నిలదీస్తారనే ఆందోళనతోఉన్న జగన్ అసెంబ్లీ వెనుకవైపు నుంచి అసెంబ్లీకి వచ్చారు. కాగా..జగన్ కారును అసెంబ్లీ ఆవరణలోనికి రానివ్వాలని వైకాపా ఎమ్మెల్యేలు మంత్రి కేశవ్‌ను బతిమాలాడారు. ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఈ విషయం చెప్పడంతో జగన్ పట్ల గౌరవంగానే వ్యవహరించాలని ఆయన సూచించారట. దీంతో జగన్ కారును అసెంబ్లీ ఆవరణలోకి వచ్చింది. కాగా జగన్ ప్రమాణస్వీకారం చేసేటప్పుడు ఆయన గొంతు పలుమార్లు వణికింది. తన పేరును కూడా ఆయన మరిచిపోయినట్లు ఉన్నారు. తన పేరును వై.ఎస్.జగన్మోహన్ అని పలికి తరువాత రెడ్డి అంటూ సవరించారు. మొత్తం మీద ఘోర ఓటమి నుంచి ఆయన ఇంకా తేరుకున్నట్లు లేరని కొందరు టిడిపి ఎమ్మెల్యేలు వ్యాఖ్యానించారు.