WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ఎముక విరిగిందని తెలుసు...కానీ...: సచిన్‌

24ఏళ్లపాటు క్రికెట్‌ను శాసించిన 'సచిన్‌'టెండూల్కర్‌ తన కెరీర్‌కు సంబంధించిన ఆసక్తికరమైన ఓ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. ఒక రోజు మ్యాచ్‌లో తాను బ్యాటింగ్‌ చేస్తుండగా బౌలర్‌ విసిరిన బంతి తన పక్కటెముకులకు బలంగా తాకిందట. ఆ సమయంలో ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా మారిందట. అంతే కాకుండా దెబ్బ తగిలిన చోట ఎముగ విరిగిపోయిందని తనకు స్పష్టంగా తెలిసిందట. అయితే ఆ బాధన ప్రత్యర్థి బౌలర్‌కు తెలియకుండా బాధను పండిబిగువున పట్టి బ్యాటింగ్‌ చేశాడట. తాను బాధపడినట్లు బౌలర్‌కు తెలిస్తే బౌలర్‌ మరింత రెచ్చిపోతాడని...ఎముక విరిగిపోయినా ఆ బాధ బయటకు తెలియనీయలేదని 'సచిన్‌' చెప్పుకున్నారు. క్రికెట్‌లో ఆటగాళ్లకు ఫిట్‌నెస్‌ చాలా ముఖ్యమని తాను తన కెరీర్‌లో పరుగుల కోసం 353 కి.మీ పరుగెత్తానని ఈ సందర్భంగా సచిన్‌ తెలిపారు. సవాళ్ల స్వీకరించడానికి ఎప్పుడూ యువ క్రికెటర్లు సిద్ధంగా ఉండాలని ఆయన అన్నారు.

(1216)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ