WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ఇండోర్‌ టెస్టులో 'కోహ్లీ' సెంచరీ...!

గత కొన్నాళ్లుగా ఫామ్‌ కోల్పోయి ఇబ్బందులు పడుతున్న భారత్‌ టెస్టు జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ మళ్లీ మునుపడి లయ అందుకున్నారు. గత కొన్నాళ్లుగా వరుసగా తక్కువ స్కోర్లకే అవుట్‌ అవుతున్న ఈ స్టార్‌బ్యాట్స్‌మెన్‌ ఈ రోజు మళ్లీ ఫామ్‌లోకి వచ్చి సెంచరీ చేశాడు. ఒత్తిడిలో బాగా ఆడే 'కోహ్లీ' ఈ రోజు కూడా భారత్‌ గడ్డుపరిస్థితి ఎదుర్కొంటున్న సమయంలోనే సెంచరీతో భారత్‌ను ఆదుకున్నాడు. 60 పరుగులకు ఓపెనర్లు ఇద్దరూ పెవిలియన్‌కు చేరడంతో బరిలోకి దిగిన 'కోహ్లీ' తనదైన శైలిలో భారత్‌ను గట్టెకించాడు. తొలుత 'పుజారా'తో, అనంతరం 'రహేనే'తో కలసి పరుగు వరద పారించాడు. మొత్తం 191 బంతులను ఎదుర్కొన్న కోహ్లీ 10 బౌండరీల సహాయంతో 103(నాటౌట్‌)పరుగులతో క్రీజ్‌లో ఉన్నాడు. మరో వైపు రహానే కూడా భారీ స్కోరు దిశగా వెళ్తున్నాడు. రహానే 172 బంతులను ఎదుర్కొని 79పరుగులు చేశాడు. దీనిలో 9ఫోర్లు, ఒక సిక్స్‌ ఉంది. చాలా రోజుల తరువాత బరిలోకి దిగిన 'గౌతమ్‌ గంభీర్‌' 29 పరుగులు చేయగా మరో ఓపెన్‌ 'విజయ్‌' 10 పరుగులు చేశాడు. పుజారా మరోసారి భారీ స్కోరు చేసే అవకాశాన్ని కోల్పోయాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్‌ 267/3తో పటిష్ట స్థితిలో ఉంది. మూడు టెస్టుల సిరీస్‌లో తొలి రెండు టెస్టులను భారత్‌ గెల్చుకుంది.

(210)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ