WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ముగ్గురు మంత్రులపై 'సిఎం' ఆగ్రహం...!

అధికారంలో లేనప్పుడే మెజార్టీ కౌన్సిలర్లు పార్టీ తరుపున గెలిచారు. తరువాత మున్సిపల్‌ ఛైర్మన్‌ పదవి కూడా దక్కింది. దురదృష్టావశక్తూ ఆ చైర్మన్‌ మరణించారు. మళ్లీ మున్సిపల్‌ ఛైర్మన్‌ ఎన్నిక జరుగుతుందని మీ అందరికీ తెలుసు. ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించారు..మనపార్టీ కౌన్సిలర్‌ 'జగన్‌' పార్టీ అభ్యర్థికి ఓటు వేయడం ఏమిటి? 'జగన్‌' పార్టీ అభ్యర్థికి ఓటు వేసి ఆమె వ్యవహారశైలిని ముందుగా ఎందుకు తెల్సుకోలేకపోయారు. అధికారంతో జల్సాలు చేసుకోవడానికి అల‌వాటు పడ్డారు. 'పెడన' నియోజకవర్గంలో అపార రాజకీయ అనుభవం ఉన్న కాగిత వెంకటరావు, రెండుసార్లు ఎంపిగా గెల్చిన కొణకళ్ల నారాయణ, బందర్‌ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి కొల్లు రవీంద్ర, జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పుల్లారావు కూడా దీనికి బాధ్యత వహించాలి. ఏమిటి? ఆషామాషీగా ఉందా? పార్టీ ప్రతిష్టను బజారుపాలు చేశారు..? అధికారం లేనప్పుడే మున్సిపల్‌ చైర్మన్‌ను గెలిచాం.. త్వరలో అధికారం మాదే అని 'జగన్‌' పార్టీ చెబుతుంటే 'మీకు సిగ్గు అనిపించడం లేదా? అని ముఖ్యమంత్రి పై తెలుగుదేశం నాయకులను తీవ్రంగా మందలించారట. ఆ మహిళా కౌన్సిలర్‌ పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా ఓటు వేస్తుందని తాను ఊహించలేకపోయానని, స్థానిక ఎమ్మెల్యే కాగిత వాపోతున్నారు. దీని వెనుక ఎంపి నారాయణ ఆయన కుమారుడు హస్తం ఉందని 'కాగిత' అనుచరులు దుయ్యబడుతున్నారు. భవిష్యత్‌లో తన కుమారుడిని 'పెడన' నుంచి పోటీ చేయించాలని భావిస్తూ తెలివిగా 'కాగిత'ను దెబ్బతీశారని దీనికి ఆయనే బాధ్యుడని అధ్యక్షుడికి 'పెడన' నియోజకవర్గ నాయకులు ఫిర్యాదు చేశారు. త్వరలో జరగనున్న మంత్రి వర్గ విస్తరణలో తన మంత్రి పదవి ఊడిపోతుందని, కాగితకు మంత్రి పదవి ఇస్తారని జరుగుతున్న ప్రచారానికి భయపడి మంత్రి కొల్లు రవీంధ్ర పథకం ప్రకారం తెరవెనుక ఉండి 'కాగిత' వెంకటరావును దెబ్బకొట్టారని పేరు చెప్పడానికి ఇష్టపడని మంత్రి ఒకరు చెప్పారు. అంతే కాకుండా మండల ఎన్నికల్లో కూడా అయిదుగురు ఎంపిటీసీలు 'జగన్‌' పార్టీకీ, నలుగురు టిడిపికి ఉన్నారని మెజార్టీ వారికే ఉందని అందుకే ఆ పార్టీ అభ్యర్థి ఎంపిపిగా ఎన్నికయ్యారని ఎమ్మెల్యే కాగిత వెంకటరావు అనుచరులు చెబుతున్నారు. అధికారంలేని 'జగన్‌' పార్టీ టిడిపి కౌన్సిలర్‌ చేత ఓటు వేయించుకుంటే అధికారం ఉండి కూడా మీరు ఇద్దరు జెడ్‌పిటీసిలను ఎందుకు ఆకర్షించలేకపోయారు..ఇది మీ అందరి చేతకాని తనం..మంత్రులు కొల్లి రవీంద్ర, దేవినేని ఉమామహేశ్వరరావు పుల్లారావులు బాధ్యులని ముఖ్యంత్రి చంద్రబాబు ఆగ్రహంతో కేకలు వేశారట. ఏది ఏమైనప్పటికీ అధికారంలేని 'జగన్‌' పార్టీ నేతలు సత్తా చూపిస్తే అధికారం ఉండి కూడా 'టిడిపి' నేతలు పరువు పోగొట్టుకోవాల్సి ఉంది.


(871)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ