WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

పరమ బోరింగ్‌ 'నాగాభరణం'...!

గ్రహణ సమయంలో దేవతల శక్తి నశించి, క్షుద్ర శక్తులకు బలం వస్తుంది. దాంతో వారు లోక వినాశ చర్యలకు పాల్పడుతుంటారు. ఇలాంటి దుష్ట శక్తుల బారి నుంచి లోకాన్ని కాపాడటానికి దేవతలు వారి శక్తిని ఓ కలశంలో ఉంచి భూలోకంలో ఓ శక్తివంతమైన ప్రదేశంలో దాచి, దానికి అష్టదిగ్భంధనం చేస్తారు. ఆ కలశంను నాగభరణం అంటారు. దాన్ని కాపాడే బాధ్యతను శివయ్య కుటుంబానికి అప్పగిస్తారు. కలశంను తమ వశం చేసుకుంటే తమకిక తిరుగుండదని లోకంలోని దుష్టశక్తులన్నీ ప్రయత్నిస్తుంటాయి. కథ ఇలా నడుస్తుండగా నాగభరణం అర్కియాలజీ డిపార్డ్‌మెంట్‌కు దక్కుతుంది. వారు దాన్ని ఢిల్లీ భద్రపరుస్తారు. చివరకు ఇండియాలో జరగబోయే వరల్డ్‌ మ్యూజిక్‌ కాంపిటీషన్‌లో గెలిచిన వారికి నాగభరణం బహుమతిగా ఇస్తామని ప్రకటిస్తారు. దాని కోసం అనేక మంది పోటీలు పడుతుంటారు. నాగభరణంను గెలవడానికి చరణ్‌ గ్రూపు కూడా పోటీ పడుతుంది.చరణ్‌ దగ్గర శిష్యరికం చేయాలని నాగమ్మ(రమ్య) కోరుకుని, చరణ్‌ తల్లిదండ్రులు, ఫ్రెండ్స్‌ను మచ్చిక చేసుకుని వారి గ్యాంగ్‌లో చేరుతుంది. ఎంతో శక్తివంతమైన నాగభరణంను గెలుచుకోవాలని పారిస్‌ నుండి ఓ విలన్‌ గ్యాంగ్‌(ముకుల్‌ దేవ్‌, రవి కాలే తదితరులు) ప్రయత్నం చేస్తుంది. దాని కోసం చరణ్‌ టీంను తమ కంపెనీ తరపున పోటీలో పాల్గొనాలని అడుగుతారు. కానీ అందుకు చరణ్‌ ఒప్పుకోక పోవడంతో చరణ్‌ ఫ్రెండ్స్‌ను చంపేస్తారు. అప్పుడు నాగమ్మ పాముగా మారి విలన్స్‌ను చంపేస్తుంది. నాగమ్మ మనిషి కాదు, పాము అనే నిజం తెలుసుకున్న చరణ్‌ ఏం చేస్తాడు? అసలు నాగమ్మ ఎవరు? చరణ్‌ వద్దనే ఎందుకు శిష్యురాలుగా చేరుతుంది? అసలు ఇంతకీ నాగభరణంను చరణ్‌ గెలుచుకున్నాడా? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే...సినిమా నాగభరణం గురించి చెప్పడంతో స్టార్ట్‌ అవుతుంది. ఐదు నిమిషాలు తర్వాత సినిమాలో అసలు గందరగోళం స్టార్ట్‌ అవుతుంది. కథలో సన్నివేశాలకు పొంతన లేకుండా కనపడుతుంది. ముఖ్యంగా ఫస్టాఫ్‌లో హీరో, హీరోయిన్‌ మధ్య సన్నివేశాలు, ఫ్యామిలీ డ్రామా సరిగా లేదు. హీరో స్నేహితులను విలన్స్‌ చంపేస్తే వారందరూ హాస్పిటల్లో ప్రాణాలు విడిచే సీన్‌ చూసి ప్రేక్షకుడు నోరెళ్లబెడతాడు. అలాగే నాగమ్మ విలన్‌ను చంపడానికి వచ్చినప్పుడు హీరో కూడా అక్కడకు వచ్చే సందర్భానికి తగ్గ సన్నివేశం లేదు. ఇక సెకండాఫ్‌లో నాగమ్మ ప్లాష్‌బ్యాక్‌ చూస్తే అరుంధతి సినిమా గుర్తుకు వస్తుంది. నాగమ్మ వంటి పవర్‌ఫుల్‌ పాత్రను రమ్య సరిగా హ్యాండిల్‌ చేయలేకపోయింది. ఇక దుష్టశక్తులు కలశం గురించి చేసే పోరాటాలు ప్రేక్షకుడికి ఆసక్తిని కలిగించకపోగా, విసుగును తెప్పిస్తాయి. సాయికుమార్‌ పాత్ర అలా వచ్చి ఇలా మాయమవుతుంది. అలాగే నాగకలశంను ఎక్కడైనా భద్రమైన చోటనే దాచాలి కానీ అందరికీ తెలిసేలా దాచడమేంటో అర్థం కాదు.నటీనటుల పెర్‌ఫార్మెన్స్‌ ఆకట్టుకోలేదు. ఇక గురుచరణ్‌ సంగీతం, బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ సరేసరి..అర్థం కానీ పాటలు, గందరగోళమైన బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ ప్రేక్షకుడిని అయోమయానికి గురిచేస్తాయి. వేణు చాయాగ్రహణం పరావాలేదు. స్వర్గీయ విష్ణువర్ధన్‌ను తెరపైన ఆవిష్కరించిన తీరు చాలా బావుంది. జానీ హర్ష ఎడిటింగ్‌ బాలేదు. ఇక కోడిరామకృష్ణ తన పాత సినిమాలైన అంజి, అరుంధతిలను మిక్స్‌ చేసి నాగభరణం సినిమా కథను తయారు చేసుకున్నట్లు కనపడింది. స్క్రీన్‌ప్లే బాలేదు.

(180)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ