WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

రాకుమారుడికి ఉరిశిక్ష...!

' ఆ దేశంలో వాళ్లు ఎంత పెద్ద వాళ్లయినా, లక్షల కోట్ల ఆస్తులు ఉన్నా....నేరం చేస్తే శిక్ష అనుభవించాల్సిందే...చివరకు యువరాజు అయినా సరే...అక్కడ నేరస్తులను ఎంత భయంకరంగా శిక్షిస్తారంటే మరొకరు అటువంటి నేరం చేయాలంటే భయంతోనే వణికిపోతారు...ఇంతకీ ఆ శిక్షలు ఎక్కడ అంటారా? సౌదీ అరేబియాలో... ఓ హత్య కేసులో దోషిగా తేలిన రాకుమారుడికి మరణశిక్ష విధించింది అక్కడి కోర్టు. శిక్ష విధించడమే కాకుండా వేగంగా శిక్షను అమలు చేసింది. సౌదీ రాజవంశంలో ఇలా ఓ రాజకుమారుడికి ఉరిశిక్ష విధించడం ఇదే తొలిసారి. 2012లో రియాద్‌ శివారులోని ఓ క్యాంప్‌లో జరిగిన ఘర్షణలో అదెల్‌ అఈ మహెమిద్‌ అనే వ్యక్తిని సౌదీ రాకుమారుడు 'టుర్కీబిన్‌ సౌద్‌ అకబీర్‌' తుపాకితో కాల్చి చంపాడు. దీంతో 'కబీర్‌'ను పోలీసు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. అతను నేరం చేసినట్లు 2014లో రియాద్‌ కోర్టు నిర్దారించి మరక్షణశిక్ష విధించింది. దీంతో అతనని బుధవారం నాడు ఉరి తీసినట్లు ఆ దేశ అంతర్గత వ్యవహారాలశాఖ ప్రకటించింది. సౌదీ చట్టాల ప్రకారం...హత్య,మాదకద్రవ్యాల రవాణా, దొంగతనం, అత్యాచారం వంటివి తీవ్రమైన నేరాలుగా పరిగణిస్తారు. ఈ కేసుల్లో చాలా మందికి అత్యంత పాశవికంగా శిరచ్ఛేదనం కూడా చేస్తారు. ఇప్పుడు 'రాకుమారుడికి' ఉరిశిక్ష విధించడం కూడా ఆ కోవలోకే వస్తుంది.

(464)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ