ప్రతిపక్షహోదా కోసం దేబిరింపులు దేనికి జగన్...!?
ఎన్నికల్లో ప్రజలు ఘోరంగా ఓడించినా...వైకాపా అధినేత వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి గుణపాఠం నేర్చుకున్నట్లు కనిపించడం లేదు. ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజే..ఎన్నికల్లో ఏదో జరిగిపోయింది. ఆధారాలు లేవు..అంతా దేవుడికే..తెలుసు...నేను ఇచ్చిన సొమ్ములు తీసుకున్న అక్కచెల్లెమ్మలు, అవ్వతాతల ఓట్లు ఎటుపోయాయో..అంటూ శాపనార్ధాలు పెట్టారు. ప్రజాతీర్పును గౌవరవించకుండా ప్రేలాపనలు పేలారు. అంతేనా..వైకాపా కాలకేయ సైన్యంతో ఇవిఎంలను మ్యానేజ్‌చేశారంటూ..సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. తాను గెలిస్తే...నిజాయితీగా గెలిచినట్లు..అదే పక్కవాళ్లు గెలిస్తే మాత్రం ఏదో చేసినట్లా అని ప్రజలు ఈసడించుకుంటున్నా తుడిచేసుకుని పోతున్నారు. అసెంబ్లీలో సభ్యులు ప్రమాణస్వీకారం చేసేటప్పుడు మంత్రుల తరువాత తనచేత స్పీకర్ ప్రమాణస్వీకారం చేయించారని, తనను అవమానించారని ఒకటే వాపోతున్నారు. ఆంధ్రా ప్రజలు వైకాపాకు ప్రధాన ప్రతిపక్షహోదా కూడా ఇవ్వకపోతే..స్పీకర్ ఏమి చేస్తారనే ప్రశ్న టిడిపి సభ్యుల నుంచి వస్తోంది. అసెంబ్లీకి వస్తే..తనను ఏదో చేస్తారని, ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని దేబిరింబులు దేనికి...? గతంలో అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబుపై చేసిన హూంకరింపులు,కవ్వింపులు..సైగచేస్తే ప్రతిపక్షహోదాపోతుందని, ఐదుగురిని లాగేస్తే..చాలని ప్రగల్భాలు పలికి ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని దేబిరింపులు ఎందుకు..? ప్రజాతీర్పును గౌరవించకుండా, ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తానంటే..ఎలా కుదురుతుంది? అధికారం ఉన్నప్పుడు అరాచకంగా, ఇష్టారాజ్యంగా, లెక్కలేనితనంగా పాలించి,ఇప్పుడు నీతులు, సూక్తులు చెబితే జనం నమ్ముతారా...? ప్రజాస్వామ్యంపై విశ్వాసం ఉంటే..అసెంబ్లీకి హాజరై ప్రజాసమస్యలపై పోరాడితే..ప్రభుత్వం అధికారికంగా ప్రధానప్రతిపక్షహోదా ఇవ్వకపోయినా..ప్రజలు ఇస్తారనే సంగతిని జగన్ మందిమాగాదులు గుర్తించాలి. అధికారంలో ఉన్నన్నాళ్లూ అసత్యాలు, అర్థసత్యాలు, అభండాలు వేసి రోజులు గడిపి ప్రజల ఆగ్రహానికి గురై ఇప్పుడు దేబిరిస్తే పట్టించుకునేవాళ్లెవరు..జగన్..?