WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

పోరాడి ఓడిన భారత్‌...!

న్యూఢిల్లీలో గురువారంనాడు భారత్‌-న్యూజిలాండ్‌ల మధ్య జరిగిన రెండవ వన్డేలో భారత్‌ పోరాడి ఓడింది. ఒక దశలో విజయం అంచు వరకువెళ్లినా విజయాన్ని ముద్దాడలేకపోయింది. పేరు మోసిన బ్యాట్స్‌మెన్‌ అంతా పెవిలియన్‌కు చేరినా మొక్కవోని దీక్షతో బౌలర్లు విజయం కోసం పోరాడారు. 172 పరుగులకే రోహిత్‌శర్మ, రహానే, కోహ్లీ, పాండే,ధోనీ, జావెద్‌లు అవుట్‌ అయినా చివరి బ్యాట్స్‌మెన్‌ పాండ్యా(36) ఉమేష్‌ యాదవ్‌ (17)లు కివీస్‌కు చెమటలు పోయించారు. 172/6తో ఉన్న భారత్‌ ఇన్సింగ్స్‌ ఇక ఎంతో సేపు సాగదని భావించిన న్యూజిలాండ్‌కు పాండ్యా, ఉమేష్‌లు చుక్కలు చూపించారు. ఒకటి...రెండు పరుగులు తీస్తూ ...వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ లక్ష్యం దిశగా తీసుకెళ్లారు. ప్యాండ్యా 32 బంతుల్లో 3 ఫోర్లతో 36 పరుగులు చేయగా 'యాదవ్‌' అతనికి సహకరించారు.వీరిద్దరి జత 1996లో బెంగుళూరులో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో బౌలర్లు శ్రీనాధ్‌, అనిల్‌కుంబ్లేలు పోరాడిన విధంగా పోరాడారు. ఆ మ్యాచ్‌లో శ్రీనాథ్‌, కుంబ్లేలు తొమ్మిదో వికెట్‌కు 51 పరుగులు జోడించి భారత్‌ను గెలిపించిన విధంగానే పాండ్యా,యాదవ్‌లు మెరుపులు మెరిపించారు. అయితే 49వ ఓవర్లల్లో బోల్డ్‌ విసిరిన ఓపుల్‌ లెంగ్త్‌ బంతికి పాండ్యా భారీ షాట్‌ కొట్టబోయి సెంటర్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. దీంతో పాండ్యా పోరాటం ముగిసింది. అనంతరం సౌతీ బ్రుమాను ఓ యార్క్‌తో బౌల్డ్‌ చేయడంతో భారత్‌ పోరాటం ముగిసింది. అయితే భారత్‌ ఈ మ్యాచ్‌లో ఓడిపోయినా చివరకు వరకు పోరాడడం అభిమానులకు ఆనందానిచ్చింది. మొదట బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ 50ఓవర్లల్లో 9 వికెట్లు కోల్పోయి 242 పరుగులు చేసింది. స్వల్పలక్ష్యాన్ని చేధించడానికి భారత్‌ బ్యాట్స్‌మెన్‌ అపసోపాలు పడ్డారు. మొదటి వికెట్‌కు రోహిత్‌,రెహానే కలసి 21 పరుగులు జోడించారు. అనంతరం బోల్డ్‌ బౌలింగ్‌లో రోహిత్‌శర్మ అవుట్‌ కావడంతోనే భారత్‌ కష్టాల్లో పడింది. అనంతరం వచ్చిన బ్యాట్స్‌మెన్‌ అంతా పెవిలియన్‌కు క్యూ కట్టడంతో భారత్‌ 74 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి చిక్కుల్లో పడింది. అయితే కెప్టెన్‌ ధోనీ, నూతన ఆటగాడు జావెద్‌లు భారత్‌ను ఆదుకున్నారు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 66 పరుగులు జోడించి భారత్‌ను మళ్లీ ఆటలోకి తెచ్చారు. అయితే జావెద్‌(41) పరుగులు చేసి హెన్రీ బౌలింగ్‌లో అవుట్‌ అవడం, ధోనీ కూడా వెంటనే అవుట్‌ అవడంతో భారత్‌ కోలుకో లేకపోయింది.అంతకు ముందు న్యూజిలాండ్‌ ఇన్సింగ్స్‌లో విలియమ్‌సన్‌(118) కెప్టెన్‌ ఇన్సింగ్‌ ఆడడంతో న్యూజిలాండ్‌ ఓ మోస్తరు స్కోరు సాధించగలిగింది. సెంచరీ చేసిన విలియమ్‌సన్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది. ఐదు వన్డేల సిరీస్‌లో భారత్‌, న్యూజిలాండ్‌ చెరో మ్యాచ్‌ గెలిచాయి.

(338)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ