WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'అంబానీజీ...!'జియో'లో వేగం....ఏది...?

టెలికాం రంగంలో సంచలనం సృష్టించిన రియలన్స్‌ 'జియో'పై వినియోగదారులు అప్పుడే పెదవి విరుస్తున్నారు. నిన్నటి దాకా 'జియో' సిమ్‌ల కోసం క్యూ కట్టిన వినియోగదారులు ఇప్పుడు దాని డేటా వేగం చూసి నివ్వెరపోతున్నారు. మొదట 'జియో' సిమ్‌లు మార్కెట్‌లోకి వచ్చినప్పుడు దాని వేగం చూసి...'ఔరా...అన్న వినియోగదారులు..క్రమంగా దానిపై ఆసక్తి చూపించడం లేదు. మిగతా ఆపరేటర్ల కన్నా 'జియో' పెద్దగా మెరుగేం కాదని ఇప్పుడు వారు చెప్పుకుంటున్నారు. 'జియో' సిమ్‌లు వినియోగం బాగా పెరగడంతో దాని నెట్‌ వేగం మందగించింది. హైదరాబాద్‌లో 'జియో'లు తొలిసారి బయటకు వచ్చినప్పుడు ఉన్న దాని 4జి వేగం 11.4 ఎంపిబిఎస్‌ పైగా ఉందని తేలింది. అయితే రాను రాను..ఆ వేగం మందగించి ఇప్పుడు 4ఎంపిబిఎస్‌కు చేరువ అవుతుందని భావిస్తున్నారు. ఈ వేగం ఎయిర్‌టెల్‌, ఐడియా,వోడాఫోన్‌,ఆర్‌కామ్‌ కన్నా తక్కువే. ఒక వైపు రిలయన్స్‌ 'జియో' టెలీకాం నిబంధనలను అతిక్రమించిందని ఇతర ఆపరేటర్లు ట్రాయ్‌కు ఫిర్యాదు చేయడం..దాన్ని 'టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా(ట్రాయ్‌) కొట్టివేయటంతో తన కస్టమర్లును పెంచుకోవడమే లక్ష్యంగా 'రిలయన్స్‌' తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. జీవితకాలం పాటు లోకల్‌, ఎస్‌టీడీ, నేషనల్‌కాల్స్‌ను ఉచితంగా అందిస్తున్నట్లు రిలయన్స్‌ చేసిన ప్రకటన టెలీకాం దిగ్గజాలకు షాక్‌కు గురిచేంది. ఇదంతా మార్కెట్‌ను తన వైపు మళ్లించుకునేందుకేనన్న వారి మాటలను 'రిలయన్స్‌ నిజం చేస్తోంది. 'జియో' ఇప్పుడు కేవలం డాటా కోసమే వినియోగదారులు వినియోగిస్తున్నారు..ఆ సిమ్‌తో ఫోన్లు ఇతర ఫోన్లు ఏవీ కలవడం లేదు.. డిసెంబర్‌ 31కి దాకా వెల్‌కమ్‌ ఆఫర్‌ కింద పూర్తి ఉచితంగా ఇస్తోన్న 'జియో' సిమ్‌లు ఆ తరువాత అయినా నాణ్యమైన సేవలు అందిస్తుందా? లేదా...? కస్టమర్లకు అపరమితమైన డేటా అందిస్తామని,నాణ్యమైన సేవలను అందిస్తామని చెప్పిన రిలయన్స్‌ అధినేత ఇప్పుడు ఆ మాట మరిచి 'జియో' సిమ్‌లను ప్రజలకు అంటగట్టడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. మార్కెట్‌ను సొంత చేసుకోవాలన్న కోరిక తప్పేం కాదు...కానీ..వినియోగదారులకు నాణ్యమైన సేవలను అందించాల్సిన బాధ్యత వారిపై ఎంతో ఉంది. ఇతర టెలీకాం ఆపరేటర్లు తమను ర్యాగింగ్‌ చేస్తున్నారన్న 'రియలన్స్‌' అధినేత ముఖేష్‌ అంబానీ... ఒక్కసారిగా వారి మార్కెట్‌ను తన్నుకుపోతే చూస్తూ ఊరుకుంటారా? అయితే వారి కంటే మెరుగైన నాణ్యమైన సేవలను అందిస్తే....వారు ర్యాగింగ్‌ చేసినా...ఇంకేం చేసినా...వినియోగదారులు 'జియో' చుట్టూనే తిరిగుతారు...కానీ...అంత సీన్‌ 'జియో'లో కనిపించడం లేదు...చూద్దాం..రాబోయే రోజుల్లో అయినా 'ముఖేష్‌' తన కంపెనీ తరును మెరుగుపరుస్తారేమో...!

(దావులూరి హనుమంతరావు)

(513)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ