WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

టిడిపిలో చేరిన 'వేదవ్యాస్‌'...!

మాజీ డిప్యూటీ స్పీకర్‌ బూరగడ్డ వేదవ్యాస్‌ను టిడిపిలో చేర్చుకునే ముందు రోజే తనకు సమాచారం ఇచ్చారని 'పెడన' ఎమ్మెల్యే కాగిత వెంకటరావు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా నాయకుడ్ని రాజకీయంగా దెబ్బకొట్టేందుకే....వేదవ్యాస్‌ను పార్టీలో చేర్పించడంలో మచిలీపట్నం ఎంపి కొనకళనారాయణ తెరవెనుక ఉండి తతంగం నడిపించారని 'కాగిత' అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముప్పయి సంవత్సరాల నుండి కాంగ్రెస్‌ నేతలతో పోరాడుతూ తెలుగుదేశం పార్టీ బలం పెంచి ఈనియోజకవర్గంలో కాంగ్రెస్‌ వ్యతిరేక నాయకులుగా గుర్తు తెచ్చుకున్న మా ఎమ్మెల్యే 'కాగిత'ను ఎంపినారాయణ తదో విధంగా దెబ్బకొట్టాలని కుట్ర పన్నుతున్నారని..ఆ కుట్రను ఎలా తిప్పికొట్టాలో తమకు తెలుసనని...ఇప్పటికే మా నాయకుని..అధినేత చంద్రబాబు ఎవరికీ ఇవ్వని గౌరవ,మర్యాదలు ఇస్తున్నారని..ఆ ఒక్కటీ తమకు చాలని వారు అంటున్నారు. ఏ నాడూ పదవి ఇచ్చినా..ఇవ్వకపోయినా..అధినేత చంద్రబాబుపై బాహాట విమర్శలు,ఆరోపణలు 'కాగిత' చేయలేదని జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కూడా కితాబు ఇస్తున్నారు. 'కాగిత'కు మంత్రి పదవి ఇవ్వాలని ఉమ పట్టుడుతున్నారు కూడా. కరుడుగట్టిన కాంగ్రెస్‌ కుటుంబానికి చెందిన 'వేదవ్యాస్‌'ను టిడిపిలో చేర్చుకోవడంపై కాంగ్రెస్‌ వ్యతిరేకులైన టిడిపి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎవరి వల్ల కార్యకర్తలు, నాయకులు వేధింపులకు గురయ్యారో...అటువంటి వ్యక్తులే టిడిపిలో చేర్చుకోవడం ఏమిటి? 'వ్యాస్‌' కాపు సామాజికవర్గానికి చెందిన వారవడం వల్ల పార్టీలో చేర్చుకున్నారని ఆయా వర్గాలు భావిస్తున్నాయి. 1989లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఆయన 1994,1999లో టిడిపి అభ్యర్థి 'కాగిత'పై ఓడిపోయారు. 2004లో 'కాగిత'పై విజయం సాధించిన 'వ్యాస్‌' 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరి మచిలీపట్నం నియోజకవర్గంలో ఆపార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయి రాజకీయంగా తెరమరుగు అయ్యారు. ఆ తరువాత 'జగన్‌' పార్టీలో చేరారు. ఒకప్పుడు బంటుపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచి ఓడిపోయిన 'వేదవ్యాస్‌'కు చంద్రబాబు ఏదో హామీ ఇస్తే కానీ ఆయన పార్టీలో చేరి ఉంటారని పార్టీ వర్గాలు నమ్ముతున్నాయి. తాను రాజకీయాల నుండి వైదొలుగుతానని, పెడన ఎమ్మెల్యే కాగిత ప్రకటించడంతో ఆ నియోజకవర్గాన్ని 'వేదవ్యాస్‌'కు కేటాయిస్తారా? ఆ నియోజకవర్గంలో తన కుమారుని ఎమ్మెల్యేగా పోటీ చేయించాలని ఆశ పడుతున్న 'మచిలీపట్నం ఎంపి నారాయణ' భవిష్యత్‌లో ఎలా స్పందిస్తారో? వేదవ్యాస్‌ చేరిక పార్టీలో మరిన్ని గ్రూపులకు ఆస్కారం ఏర్పడనుంది 'కాగిత' అనుచరులు అంటున్నారు.

(223)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ