WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

మూడోవన్డేలో భారత్‌ ఘనవిజయం..!

న్యూజిలాండ్‌,భారత్‌ల మధ్య జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్‌లో భారత్‌ 2-1తో ముందంజ వేసింది. మొహాలీలో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్‌ ఏడు వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించింది. చేదన మొనగాడు విరాట్‌ కోహ్లీ(154నాటౌట్‌) మరోసారి రాణించడంతో భారత్‌ సులువుగా విజయం సాధించాడు. తొలుత బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ 49.4ఓవర్లలో 285పరుగులు చేసింది. అనంతరం చేధన ప్రారంభించిన భారత్‌ మూడు వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. తొలుత రహానే, రోహిత్‌ శర్మ త్వరగానే అవుట్‌ అయినా...కోహ్లీ,ధోనీలు మూడవవికెట్‌కు 150 పరుగులు సాధించారు. ధోనీ(80)91బంతుల్లో 6ఫోర్లు, మూడు భారీ సిక్స్‌లతో ఈ పరుగులు సాధించాడు. వీరిద్దరి జోడీ విడిపోయిన తరువాత 'కోహ్లీ' మరింతరెచ్చిపోయాడు. 134 బంతుల్లో 16ఫోర్లు 1 సిక్స్‌తో 154(నాటౌట్‌) సాధించాడు. కోహ్లీ దెబ్బకు భారత్‌ మరో 10 బంతులు ఉండగానే విజయ తీరాలకు చేరింది.

(273)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ