WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

టాటా-నానో మూసేద్దామన్నా...!

తీవ్రమైన నష్టాలు వస్తున్న టాటా-నానో మూసివేద్దామని తాను ప్రతిపాదించానని, అయితే దానికి 'రతన్‌టాటా' ఇష్టపడలేదని టాటా సన్స్‌ ఛైర్మన్‌ పదవి నుంచి ఉద్వాసనకు గురైన సైరస్‌ మిస్త్రీ చెప్పారు. తన పనివిషయంలో తరచూ 'రతన్‌టాటా'జోక్యం చేసుకుంటున్నారని, తనను తొలగించే విషయంలో డైరెక్టర్లు గౌరవప్రదంగా వ్యవహరించలేదని ఆయన విమర్శించారు. తనను తొలగించే ముందు తన వాదన వినిపించే అవకాశాన్ని కూడా ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. టాటాలు నిర్వహిస్తున్న వ్యాపారాల్లో ఐదు వ్యాపారాలు తీవ్రమైన నష్టాల్లో నడుస్తున్నాయని వాటిని అమ్మేద్దామని తాను ప్రతిపాదించినా దానికి 'రతన్‌టాటా' ఒప్పుకోలేదని, దీంతో వ్యాపారాల్లో నష్టాలు వచ్చాయని, మొత్తం మీద వారు అంచనా వేసిన దానికంటే లాభాలు తక్కువగా వచ్చాయని ఆయన వివరించారు. తాను ఛైర్మన్‌ పదవిని చేపట్టినప్పటి నుంచీ 'రతన్‌టాటా' ప్రతి విషయంలో జోక్యం చేసుకున్నారని,తాజ్‌ చెయిన్‌ నడుపుతున్న ఇండియన్‌ హోటల్స్‌ సమస్యలకు 'రతన్‌' బాధ్యుడని ఆయన విమర్శించారు. 'రతన్‌టాటా' కలల ప్రాజెక్టు అయిన 'టాటా-నానో' విఫలమైనా దాన్ని కొనసాగించడానికే మొక్కు చూపించారని, దీనిపై సైరస్‌మిస్త్రీ తీవ్రంగా స్పందించడమే వివాదానికి మూల కారణమని తెలుస్తోంది. చిన్న కుటుంబం వారి స్వంత కారులో ప్రయాణించాలన్న 'రతన్‌టాటా' కల అయిన 'టాటా-నానో' మార్కెట్‌లో తీవ్రంగా విఫలమైంది. దాన్ని కొనుగోలు చేయడానికి సామాన్య కుటుంబీకులు ఎవరూ ముందుకు రావడం లేదు..అయినా 'రతన్‌' దానిపైనే కోట్లు కుమ్మరించడం 'సైరస్‌'కు నచ్చలేదు. వ్యాపారం కేవలం లాభాలకే చేయాలన్న 'సైరస్‌' వాదనను 'రతన్‌' పట్టించుకోలేదు..సామాన్యుల సమస్యలకు పరిష్కారం చూపుతూ వ్యాపారం చేయాలన్న 'రతన్‌టాటా' వ్యవహారశైలి 'సైరస్‌'కు నచ్చలేదు. దీంతో ఆయన ఉద్వాసన తప్పలేదు.

(859)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ