WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

మీరు...కలలోనైనా ఇంత సొమ్ము చూసి ఉంటారా...?

సుమారు 13వేల కోట్ల రూపాయలు ఒకే వ్యక్తి వద్ద దొరికాయి. గుట్టల కొద్దీ నోట్ల కొట్టలు చూసిన ఆ అధికారులకు కళ్లు బైర్లు కమ్మాయి. వేల కోట్లు ఒకే వ్యక్తి తన ఇంటిలో కుప్పలు కుప్పలు పోసుకుని ఉండడం చూసిన వారు సంభ్రమాశ్చర్యాలకు గురి అయ్యారు. ఇదంతా నిజమేనా...కలా...అని ఒకటికి రెండుసార్లు తమను తాము గిల్లి చూసుకున్నారు. ఇంత సొమ్మా...? అంటూ ఎవరికి వారు..నిశ్చేష్యులయ్యారు. భారతదేశ చరిత్రలో ఎప్పుడూ...ఎక్కడా ఇంత సొమ్ము ఒక వ్యక్తి దగ్గర చూసిన వాళ్లు ఎవరూ లేరని ఇన్‌కమ్‌టాక్స్‌ అధికారులు తమలో తాము చర్చించుకున్నారు. ఇంత సొమ్ము ఎవరిదనుకుంటున్నారా..ఈ సొమ్మంతా ముంబాయికి చెందిన 'భాయీ ఠాకూర్‌'కు చెందిందట. హవాలా వ్యాపారం చేసే ఈ వ్యక్తి 13వేల కోట్ల రూపాయలు తన దగ్గర పెట్టుకుని ఇతర దేశాలతో అక్రమ వ్యాపారాలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. 'ఠాకూర్‌'కు నేర చరిత్ర ఉందని...కూడా పోలీసులు చెబుతున్నారు. మొత్తం మీద ఇంత నల్లధనం ఒకరి వద్దే పోగుబడి ఉంటే దేశంలో ఉన్న ఇతర నేరస్తులు...రాజకీయ నాయకుల వద్ద ఎంత నల్లధనం పోగుబడి ఉంటుందో అన్న సందేహం సామాన్య ప్రజల్లో కల్గుతుంది. భారతదేశం పేద దేశమని స్వాతంత్య్రం వచ్చిన దగ్గర నుంచి చెప్పుకుంటున్న మనం...ఇటు వంటి ఆర్థిక నేరస్తులను శిక్షించకపోవడం వల్లే...ఈ దేశం ఎన్నాళ్లున్నా ఇంకా పేదదేశంగానే చెప్పుకోవాల్సి వస్తోంది.

(938)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ