WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

భారత్‌ ఘనవిజయం..!

సిరీస్‌ను తేల్చే మ్యాచ్‌లో భారత్‌ ఛాంపియన్‌ ఆటతీరును ప్రదర్శించింది. అసలు సిసలైన ఆటను బయటకు తీసి ప్రత్యర్థి న్యూజిలాండ్‌ను బెంబేలెత్తించింది. తొలుత బ్యాటింగ్‌లో టాప్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌ రాణించడంతో భారీ స్కోరు చేసింది. అనంతరం బౌలర్లు న్యూజిలాండ్‌ బ్యాట్స్‌మెన్‌కు చుక్కలు చూపించారు. వరుసగా వికెట్లపై వికెట్లు తీస్తూ కివీస్‌ వెన్ను విరిచారు. 23.1 ఓవర్లల్లోనే కివీస్‌ 79పరుగులకే ఆలౌట్‌ అయింది. తద్వారా భారత్‌ 190 పరుగుల భారీ తేడాతో ఐదవ వన్డేలో విజయంతో పాటు సిరీస్‌ను చేజిక్కించుకుంది. మొదటి వన్డే భారత్‌ గెలవగా రెండో వన్డే న్యూజిలాండ్‌ గెలిచింది. మూడవ వన్డేలో మళ్లీ భారత్‌ విజయం సాధించగా,నాలుగవ వన్డేలో కివీస్‌ విజయం సాధించింది హోరాహోరి పోరుకు తెరతీసింది.సీరిస్‌ విజేతను తేల్చే ఐదవవన్డేలో భారత్‌ ఛాంపియన్‌లా రాణించడంతో 'కివీస్‌' బేలగా ఓటమిని అంగీకరించి 'భారత్‌'కు సిరీస్‌ను అప్పగించింది. భారత్‌ బౌలర్లు అందరూ కలసికట్టుగా రాణించడం ఈ మ్యాచ్‌లో విశేషం. అమిత్‌మిశ్రా ఐదు వికెట్లు తీయగా, అక్షరపటేల్‌కు రెండు, బ్రుమా,ఉమేష్‌యాదవ్‌,జయంత్‌ యాదవ్‌లకు ఒక్కో వికెట్‌ దక్కింది.

(116)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ