WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'పశ్చిమ'లో టిడిపి అడ్రసు గల్లంతు....!

ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రహస్యంగా చేయించినసర్వేలో తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా నిలిచిన 'పశ్చిమగోదావరి' జిల్లాలో తాజా పరిస్థితి తెలుసుకుని ఆయన నివ్వెరపోయారట. ఈ రోజు నుంచి ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఆ జిల్లాలో ఉన్న పదిహేను నియోజకవర్గాల్లో కనీసం మూడు నుంచి ఐదు నియోజకవర్గాల్లో మాత్రమే టిడిపి అభ్యర్థులు గెలుస్తారని ఆ సర్వేలో తేలిందట. జిల్లాకు చెందిన కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టరు, ఇతర ఉన్నతాధికారులు నిజాయితీగా బాధ్యతలు నిర్వహిస్తుండడంతో అధికారపార్టీ ఎమ్మెల్యేల దోపిడికి అడ్డుకట్టపడిందట. పదిహేను మంది టిడిపి కూటమికి చెందిన ఎమ్మెల్యేల్లో ముగ్గురు మాత్రమే ప్రజలకు అందుబాటులో ఉంటున్నారట. వీరి పనితీరుపై ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. మిగతా 12మందిపై తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. మంత్రి పీతల సుజాత ప్రాతినిధ్యం వహిస్తున్న 'చింతలపూడి' నియోజకవర్గంలో అసలు సిసలైన పార్టీ కార్యకర్తలను ఆమె విస్మరించి, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుందట. ఈ విధంగా వ్యవహరిస్తున్న ఆమె తిరిగి ఎలా గెలుస్తుందని అక్కడి కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారట. రాబోయే ఎన్నికల్లో ఆమెపై పోటీ చేసేది ఎవరైనా అవలీలగా గెలుస్తారని కార్యకర్తలు అంటున్నారు. అదే విధంగా 'పోలవరం' నియోజకవర్గంలో కూడా అదే పరిస్థితి. అందినంత వరకు దండుకునే రీతిలో ఇక్కడ ఎమ్మెల్యే పనితీరు ఉందట. 'జగన్‌' పార్టీకి చెందిన అతికొద్ది మంది స్థానిక సంస్థల ప్రతినిధులు కూడా అధికారపార్టీ నేతలతో చేతులు కలిపి దోపిడీకి పాల్పడుతున్నారట. కంచుకోట లాంటి ఈ జిల్లాలో ఈ విధమైన పరిస్థితి తెచ్చుకున్న 'చంద్రబాబు' ప్రస్తుతం అక్కడి పరిస్థితిని ఎలా సరిదిద్దాలని ఆలోచిస్తున్నారు. తణుకు, ఉండి, భీమవరం ఎమ్మెల్యేలు మాత్రమే అధికారులు, ఉద్యోగులకు విలువ ఇస్తున్నారు. ఈ మూడునియోజకవర్గాల్లో అవినీతి పెద్దగా లేదని జిల్లా యంత్రాంగం అంటోందట. నియోజకవర్గాల పునర్‌విభజన అనంతరం మరో రెండు నియోజకవర్గాలు ఈ జిల్లాలో పెరగనున్న నేపథ్యంలో జిల్లా రాజకీయ చిత్రం మారుతుందని అధికారపార్టీ భావిస్తుందట. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రజల అసంతృప్తిని తొలగించి వారిని మళ్లీ పార్టీ పట్ల ఆకర్షించడానికి ఏం చేయాలనేదానిపై 'చంద్రబాబు' తీవ్రంగా కసరత్తు చేస్తున్నారట.బిజెపికి చెందిన దేవాదాయశాఖ మంత్రి మాణిక్యాలరావు ప్రాతినిధ్యం వహిస్తున్న 'తాడేపల్లిగూడెం'లో ఆయన మళ్లీ అక్కడి నుంచి పోటీ చేస్తే డిపాజిట్లు కూడా రావని అధికారపార్టీ నాయకులు 'చంద్రబాబు'కు చెప్పారట. రాజకీయ సమీకరణల్లో మార్పులు, చేర్పులు సంభవిస్తే తప్ప రాబోయే ఎన్నికల్లో ఇక్కడ టిడిపి కూటమి పరాజయాన్ని ఎవరూ ఆపలేరని స్వంతపార్టీ నేతలే బహిరంగంగా చెబుతున్నారు. ప్రస్తుతం అధికారుల నిజాయితీయే 'చంద్రబాబు'కు కొంత వరకు రక్షాకవచంగా ఉంది.

(4170)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ