WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

త్వరలో ఐదు,పదివేల నోట్లు....!

మీరు భారత్‌ పౌరులా...అయితే...మీకో శుభవార్త...త్వరలో మీ జేబుల్లోకి రెండు వేలు, ఐదువేలు, పదివేలు నోట్లు రాబోతున్నాయి. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా త్వరలో ఈ మేరకు పైన చెప్పిన నోట్లను ముద్రించబోతుందట. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఈ నోట్ల ముద్రణపై నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఐదు వందల నోటు, వెయ్యి రూపాయల నోటు మార్కెట్‌లో చలామణిలో ఉన్నాయి. ఈ నోట్ల వల్లే భారత్‌లో బ్లాక్‌మనీ పెరిగిపోతుందని, వీటిని రద్దు చేయాలని కొంత మంది రాజకీయనాయకులకు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ విషయంపై ఇప్పటికే ప్రధాని మోడీకి లేఖ రాశారు. ఐదువందలు, వెయ్య నోట్లను రద్దు చేయాలని 'చంద్రబాబు' కోరుతుంటే...దానికి విరుద్ధంగా 'మోడీ' ప్రభుత్వం రెండు, ఐదు,పదివేల నోట్లను ముద్రిస్తోంది. నూతన నోట్లను ముద్రించడం వల్ల కరెన్సీ ఖర్చును తగ్గించడమే లక్ష్యమని కేంద్ర అధికారులు చెబుతున్నారు. స్వాతంత్య్రం రాక ముందు అంటే 1946 జనవరిలో పదివేల నోట్‌ను అప్పటి ప్రభుత్వం మార్కెట్‌లో చలామణి చేసింది. ఈ నోట్‌ 1954 వరకు చలామణిలో ఉన్నా తరువాత దాన్ని అప్పటి ప్రభుత్వ రద్దు చేసింది. అయితే 1978లో ఐదు వేల నోట్‌ను ప్రభుత్వం ముద్రించి చలామణి చేసింది. ఇప్పుడు 'మోడీ' ప్రభుత్వం కూడా ఈ నోట్లను ముద్రించడానికి ప్రయత్నాలు చేస్తోంది. రెండు వేలు, ఐదువేలు,పదివేల నోట్ల వల్ల దొంగ నోట్లను అరికట్టడం సులువుతుందని రిజర్వ్‌బ్యాంక్‌ భావిస్తుంది. అంతే కాకుండా పౌరులు పెద్ద ఎత్తున్న నగదును ఎక్కడికైనా తీసుకెళ్లేందుకు సౌకర్యంగా ఉంటుందని భావించడం కూడా మరో కారణం. అయితే బ్లాక్‌మనీ భారీగా పోగుపడే అవకాశం ఉందన్న వాదనలు ఉన్నాయి. చూద్దాం...ఏమి జరుగుతుందో...!

(278)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ