WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

మాజీ సిఎం 'కిరణ్‌' పెళ్లెప్పుడో.....!?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ఆఖరి సిఎంగా పనిచేసిన నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి మళ్లీ వార్తల్లోకి వచ్చారు...! వార్తలంటే...వార్తే...మరి...! ఆయన పెళ్లి చేసుకోబోతున్నారట...! పెళ్లి కూతురు రెడీ...అటా...పెళ్లి కొడుకూ రెడీ...అటా...పెళ్లి శుభలేఖలు ముద్రిస్తున్నారట...త్వరలోనే పెళ్లి అని...అందరికీ శుభలేఖలు అందుతాయట మరి...అదేమిటి...ఆయనకు ఎప్పుడో పెళ్లి అయింది కదా...ఇప్పుడు మళ్లీ పెళ్లి ఏమిటని అనుకుంటున్నారా...? ఆ పెళ్లి కాదండి...బాబూ....రాజకీయ పెళ్లి అట...ఉమ్మడి రాష్ట్రానికి సిఎంగా ఉండి...రాష్ట్ర విభజనను తాను అడ్డుకుంటానని, తుఫాన్‌ను ఆపలేకపోయినప్పటికీ...రాష్ట్ర విభజనను ఆపుతానని అప్పట్లో భీరాలు పలికి, లాస్ట్‌బాల్‌...లాస్ట్‌బాల్‌...అంటూ ఆంధ్రాప్రజలను ఊరించి చివరకు ఊసూరుమంటూ....పదవి నుంచి దిగిపోయిన 'నల్లారి'వారు...మళ్లీ రాజకీయాల్లోకి వస్తున్నారట. చిత్తూరు జిల్లా గుర్రంకొండ మండలంలో నిన్న 'నల్లారి' వారు గ్రామంలో తనను నమ్ముకున్న కార్యకర్తలతో కాసేపు సమావేశం అయ్యారట. అందరి యోగక్షేమాలు అడిగిన 'కిరణ్‌'తో వారు...'అన్నా...ఎన్నాళ్లూ...ఇలా ఏ పార్టీ కాకుండా రాజకీయాల్లో ఉంటాం...ఏదో ఒక పార్టీలోకి మమ్ములను తోసివేయండి...అని అంటే...దానికి 'కిరణ్‌కుమార్‌రెడ్డి' స్పందిస్తూ...పెళ్లికూతురు..రెడీగా ఉంది...పెళ్లి కొడుకూ రెడీగా ఉన్నాడు..ఇక పెళ్లి కార్డూలు ముద్రితమయ్యాయి...పెళ్లి ఎప్పుడో...మీకు చెబుతాను..ఆ రోజను కలుసుకుందాం...అని చెప్పారు..అంటే 'త్వరలో తమ నాయకుడు ఏదో ఒక పార్టీలోకి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారని వారు అంటున్నారట. ఇంతకీ కిరణ్‌కుమార్‌రెడ్డి వెళ్లే పార్టీ ఏది...? అధికార తెలుగుదేశం పార్టీలోకి ఆయన వస్తారని అప్పుడెప్పుడో వార్తలు వచ్చాయి. చంద్రబాబుకు ఆగర్భశత్రువైన 'నల్లారి' కుటుంబం టిడిపిలోకి వస్తుందా...? ఒక వేళ ఆయన వస్తామన్నా 'చంద్రబాబు' వారిని ఆహ్వానిస్తారా? అంటే కాదనే అంటున్నారు చిత్తూరు జిల్లా టిడిపి నాయకులు. కాంగ్రెస్‌లో 'చంద్రబాబు' రాజకీయాలు నెరపే సమయంలో ...ఇదే కిరణ్‌కుమార్‌రెడ్డి తండ్రి అమర్‌నాథ్‌రెడ్డికి శతృత్వం ఉంది. వీరిద్దరూ కాంగ్రెస్‌లో ఉప్పూ నిప్పూలా వ్యవహరించేవారు. అప్పట్లో 'చంద్రబాబు' రాజకీయం దెబ్బకు డస్సిపోయి,అల‌సిపోయిన‌ అమర్‌నాథ్‌రెడ్డి...చివరకు మనోవ్యధతో 'ఢిల్లీ'లో మృతి చెందారని కాంగ్రెస్‌లో ఓ వర్గం భావించేది. తన తండ్రి మృతికి పరోక్ష కారకుడైన 'చంద్రబాబు'పై అప్పటి నుంచీ 'కిరణ్‌కుమార్‌రెడ్డి' ఒంటికాలిపై లేస్తారు...! ముఖ్యంగా 'కిరణ్‌కుమార్‌రెడ్డి' రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో విప్‌గా ఉన్న ఆయన 'చంద్రబాబు'పై తీవ్ర విమర్శలు చేసి 'వై.ఎస్‌' దృష్టిలో పడ్డారు. ఇక వై.ఎస్‌.రెండోసారి గెలిచినప్పుడు 'కిరణ్‌'ను స్పీకర్‌గా ఎన్నిక చేశారు. ఆ సమయంలో 'చంద్రబాబు' తన అసంతృప్తిని బాహాటంగానే బయటపెట్టారు. తరువాత కాలంలో 'కిరణ్‌' సిఎం అవడంతో అవసర్దాం సహకరించుకునేవారని ప్రచారం జరిగింది. అదంతా గతం...ఇప్పుడు మరి పాత ప్రత్యర్థిని 'చంద్రబాబు' తన పార్టీలోకి రానిస్తారా...? చెప్పలేం...ఔను..కాదు..రెండూ చెప్పవచ్చు...ఇక ...'బాబు' కాదంటే...'కిరణ్‌'కు ఉన్న మరో దారి 'జగన్‌'. అయితే 'జగన్‌' ఇప్పటికే 'నల్లారి'పై నిప్పులు గక్కుతున్నారు. తనకు రావాల్సిన సిఎం కుర్చీని రానీయకుండా 'సోనియాగాంధీ'కి తనపై చాడీలు చెప్పి దూరం చేశారని ఆయన అప్పట్లో గింజుకున్నారు. అయితే అప్పటి సంగతి ఎలా ఉన్నా ప్రస్తుతం కష్టకాలంలో ఉన్న 'జగన్‌' 'నల్లారి'ని రానిస్తారనే ఆయన సన్నిహితులు అంటున్నారు. అయితే 'జగన్‌' వైఖరి తెలిసిన 'కిరణ్‌' ఆయనకు దూరంగానే ఉంటారనేది మరో టాక్‌. వీరు కాకపోతే 'పవన్‌కళ్యాణ్‌' పార్టీ...లేదంటే 'బిజెపి'...! అదీ కాకపోతే...ఇక ఉండనే ఉంది కదా...కాంగ్రెస్‌ పార్టీ...!

(2626)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ